కేంద్ర ప్రభుత్వం శనివారం అన్లాక్ 4.0 మార్గదర్శకాలు విడుదల చేసింది ఆ మార్గదర్శకాలు ప్రకారం సెప్టెంబర్ 7 నుంచి దేశ వ్యాప్తంగా మెట్రో సేవలు ప్రారంభం కానున్నాయి. కేంద్రం మార్గదర్శకాల ప్రకారం తెలంగాణ ప్రభుత్వం కూడా సెప్టెంబర్ 7 నుంచి మెట్రో రైల్ కు గ్రీన్ సిగ్నల్ ఇచ్చే అవకాశం ఉందా? లేక హైదరాబాద్ కంటైన్మెంట్ జోన్ గా పరిగణించి ప్రభుత్వం మెట్రో ప్రారంభించడం లో ఆలస్యం చేస్తుందా? అన్నది వేచి చూడాల్సిందే. ఒకవేళ తెలంగాణలో మెట్రో రైల్ పార్రంభం అయితే హైదరాబాద్ లో బస్సులు లేక అయిదు నెలలుగా ఇబ్బంది పడుతున్న ప్రజలకు ఈ న్యూస్ చాలా ఊరట కలిగిస్తుంది.
మరోవైపు షాపింగ్ మాల్స్, సినిమా థియేటర్లు, పాఠశాలు పై లొక్డౌన్ ఆంక్షలు సెప్టెంబర్ 30 వరకు అలాగే కొనసాగింపబడతాయి అని కేంద్రం పేర్కొంది. అంతర్జాతీయ ప్రయాణాలపై కేంద్రం ఇప్పటికి ఏ నిర్ణయం తీసుకోలేదు. సెప్టెంబర్ 7 ఉంది దశల వారిగా మెట్రో సేవల రాకపోకలకు అనుమతినిచ్చింది.

అన్లాక్ 4.0 మార్గదర్శకాలు:
- సెప్టెంబర్ 7 నుంచి ప్రారంభకానున్న మెట్రోరైళ్లు
- సెప్టెంబర్ 30 వరకు స్కూళ్లు, సినిమా హాల్స్, మాల్స్ యధావిధంగా బంద్
- స్పోర్ట్స్, ఎంటర్టైన్మెంట్, రాజకీయ సమావేశాలకు 100 మందిని మించకుండా అనుమతి
- ఎటువంటి సభలు, కార్యక్రమాలు నిర్వహించాలన్న భౌతికదూరం, మాస్క్, శానిటైజర్ తప్పనిసరి
- ఓపెన్ ఎయిర్ థియేటర్లకు సెప్టెంబర్ 21 అనుమతి
- అంతరాష్ట్ర ప్రయాణాలపై కేంద్రం నిబంధనలను తొలగించింది
- కంటైన్మెంట్ జోన్లలో సెప్టెంబర్ 30 వరకు ఆంక్షలు కొనసాగింపు