TheIndiaMedia website is for sale. Those who are interested to purchase can reach out to us at theindiamedia2020@gmail.com
Home » News » టైటాన్ వాచెస్ తో డిజిటల్ ప్యేమెంట్స్..! | Titan Watches To Offer Digital Contactless Payment

టైటాన్ వాచెస్ తో డిజిటల్ ప్యేమెంట్స్..! | Titan Watches To Offer Digital Contactless Payment

by Bellamkonda

ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ డిజిటల్ ఇండియా ప్యేమెంట్స్ కు పిలుపునిచ్చిన తర్వాత ఎక్కడ చూసిన ప్రజలు డిజిటల్ ప్యేమెంట్స్ కి ఎక్కువగా మొగ్గు చూపుతున్నారు. దానికి అనుకూలంగానే అన్ని కంపెనీలు వినియోగదారుల డిజిటల్ పేమెంట్స్  అవసరాలకు దృష్టిలో పెట్టుకొని తమ ప్రొడక్ట్స్ డిజైన్ చేస్తున్నారు. అందులో భాగంగానే ఇప్పుడు వాచ్ మ్యానుఫ్యాక్చరింగ్ రంగం లో టాప్ బ్రాండ్ అయిన టైటాన్ తమ వాచెస్ ద్వారా యూజర్స్ డిజిటల్ ప్యేమెంట్స్ చేసుకునేందుకు వీలుగా కొత్త వాచెస్ తో ముందుకు తెచ్చింది.  

వాచ్ ధరలు:

టైటాన్ ఈ కాంటాక్ట్ లెస్ డిజిటల్ ప్యేమెంట్ ఫీచర్ ని ఐదు వాచెస్ తో లాంచ్ చేస్తుంది. అందులో మూడు మేన్స్ వాచెస్ మరో రెండు విమెన్  వాచెస్. పురుషుల వాచ్ ధరలు రూ 2,995 రూ 3,995 రూ 5,995.  స్త్రీల వాచెస్ ధరలు రూ 3,895, రూ 5,995.

ఈ లేటెస్ట్ టైటాన్ వాచెస్ ఉపయోగించి యూజర్స్  కాంటాక్ట్ లెస్ పేమెంట్లు చేస్కోవచ్చు.  టైటాన్  తమ వాచెస్ లో కాంటాక్ట్ లెస్ పేమెంట్లు చేయడానికి  స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా తో అగ్రిమెంట్ చేసుకుంది.  ఎస్బీఐకి చెందిన మొబైల్ బ్యాంకింగ్ యాప్ యోనో సహకారంతో టైటాన్ పే వాచ్లను విడుదల చేసేందుకు రెండు కంపెనీలు ముందుకువచ్చాయి. యోనో యాప్ ద్వారా ఎస్బీఐ వినియోగదారులు తమ డెబిట్ లేదా క్రెడిట్ కార్డులను లేకపోయినా టైటాన్ పే వాచ్ సాయంతో ప్యేమెంట్ చెయ్యొచ్చు. 

ఈ వాచ్‌లను కాంటాక్ట్ లెస్ చెల్లింపులు చేసేందుకు అనుగుణంగా రూపొందించారు. అంటే ఇప్పుడు ఎస్బీఐ ఖాతాదారులు తమ డెబిట్ లేదా క్రెడిట్ కార్డులను స్వైప్ చేయాల్సిన అవసరం లేకుండా టైటాన్ పే వాచ్ సాయంతో పాయింట్ ఆఫ్ సేల్(పీఓఎస్) మెషిన్స్ ద్వారా కాంటాక్ట్లెస్ పేమెంట్ చెయ్యొచ్చు.

 ప్రస్తుతానికి ఈ కాంటాక్టులెస్ పేమెంట్ ఆప్షన్ టైటాన్ వాచుల్లో కేవలం  ఎస్బీఐకి యూజర్స్ కి మాత్రమే అందుబాటులో ఉంటుంది.

ఈ డిజిటల్ ప్యేమెంట్ ట్యాప్ అండ్ పే టెక్నాలజీ ద్వారా ప్యేమెంట్ చేయొచ్చు.  ఈ టైటాన్ వాచెస్ ద్వారా POS మెషిన్స్ వద్ద పిన్ అవసరం లేకుండానే 2000 చెల్లించవచ్చు . ఒకవేళ అంతకు మించి అమౌంట్ పే చేయాలి అంటే మాత్రం పిన్ ఎంటర్ చేయాల్సి  ఉంటుంది.

Related Articles

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More