భారతదేశపు అత్యున్నత నాయస్థానం అయిన సుప్రీమ్ కోర్ట్ ఫైనల్ ఇయర్ కాలేజీ స్టూడెంట్స్ ని పరీక్షలు లేకుండా ప్రమోట్ చేయాలంటూ దాఖలైన పెటిషన్స్ ఈ రోజు కొట్టిపారేసింది. ఫైనల్ ఇయర్ కాలేజీ పరీక్షలు ఈ ఏడాది తప్పనిసరిగా నిర్వహించాల్సిందే అని కోర్ట్ తేల్చి చెప్పింది .
కాని కొరోనావైరస్ సంక్షోభం కారణంగా రాష్ట్రాలు కావాలనుకుంటే సెప్టెంబర్ 30 దాటి తేదీని వాయిదా వేసుకోవచ్చు అని సుప్రీంకోర్టు ఈ రోజు తెలిపింది. “ఫైనల్ ఇయర్ పరీక్షలు లేకుండా రాష్ట్రం విద్యార్థులను పై తరగతులకు ప్రోత్సహించదు” అని ఉన్నత న్యాయస్థానం చెప్పింది.
ఈ తీర్పు ప్రకారం, విద్యార్థులందరూ తుది పరీక్షలు రాయాల్సిందే రాష్ట్ర ప్రభుత్వాలు వాటిని వాయిదా వేయగలవు కాని వాటిని రద్దు చేయలేవు.

అలాగే సెప్టెంబర్ 30న యథాతథంగా యూజీసీ ఫైనలియర్ పరీక్షలు నిర్వహించాల్సిందిగా కోర్టు ఆర్డర్ చేసింది. కరోనా వైరస్ ని దృష్టిలో పెట్టుకొని పరీక్షలు లేకుండానే విద్యార్థులను పై తరగతులకు ప్రమోట్ చెయ్యాలి అంటూ ఆదిత్య ఠాక్రేకు చెందిన యువసేనతో సహ పలు సంఘాలు పిటిషన్లు దాఖలు చేశాయి. కాగా సుప్రీమ్ కోర్ట్ ఈ రోజు వాటిని కొట్టిపారేసింది.
కరోనా వైరస్ సంక్షోభం కారణంగా అన్ని విద్యాసంస్థలు మూసివేయబడిన సమయంలో విద్యార్థులు ఎదుర్కొంటున్న ఇబ్బందులను కోర్ట్ కి పిటిషన్లు సూచించాయి. విద్యార్థులు ఐదు సెమిస్టర్లు పూర్తి చేశారని మరియు గ్రేడ్ పాయింట్ సగటు లేదా సిజిపిఎ కలిగి ఉన్నారని వారు వాదించారు, అయినా ఫలితం లేక పోయింది.