TheIndiaMedia website is for sale. Those who are interested to purchase can reach out to us at theindiamedia2020@gmail.com
Home » News » మంచి ఆరోగ్యానికి తిండి తినడమూ ఒక కళే!!.

మంచి ఆరోగ్యానికి తిండి తినడమూ ఒక కళే!!.

by Murthy

అధిక బరువు సమస్య చాలా మందిని వేధిస్తుంది. బయట ఆహారానికి రుచి మరిగి.. ముఖ్యంగా జంక్ ఫుడ్ కారణంగా అధిక బరువు పెరిగి.. తీవ్ర సమస్యలు ఎదుర్కొంటున్నారు. వేగంగా తినేటప్పుడు, శరీరానికి నిజంగా అవసరమైన దానికంటే చాలా ఎక్కువ ఆహారం తీసుకోవడం చాలా సులభం. కాలక్రమేణా, అధిక కేలరీల తీసుకోవడం బరువు పెరగడానికి దారితీస్తుంది. పిల్లలలో జరిపిన ఒక అధ్యయనంలో వేగంగా తినేవారిలో 60% కూడా అతిగా తింటున్నారని తేలింది. వేగంగా తినేవారు కూడా 3 రెట్లు అధిక బరువు కలిగి ఉంటారుఏది తింటే బరువు పెరిగిపోతామో అని కడుపు కాల్చుకుంటున్నారు. అలా తిండి తినక.. శరీరానికి కావాల్సిన ప్రోటీన్స్ అందక.. మరో కొత్త సమస్యలు కొని తెచ్చుకుంటున్నారు. 

పిజ్జా, చిప్స్‌, పేస్ట్రీ వంటి ఫాస్ట్‌ఫుడ్స్‌ను చూడగానే తినేయాలనేపిస్తుంది కదూ! అయితే.. ఈసారి మాత్రం అవి తినాలంటే ఆలోచించాల్సిందే. ఎందుకంటే…. ఇప్పటి వరకూ ఈ హైలీ ప్రాసెస్ట్‌ ఫుడ్స్‌ తింటే బరువు పెరగడం, మధుమేహం, రక్తపోటు వంటి ఆరోగ్య సమస్యలు వస్తాయనే తెలుసు. ఇప్పుడా జాబితాలోకి జ్ఞాపకశక్తి తగ్గే అవకాశం ఉన్నట్లు తాజా పరిశోధనలో తేలింది. బ్రెయిన్‌, బిహేవియర్‌, ఇమ్యూనిటీ జర్నల్‌ ప్రచురించిన అధ్యయనంలో.. హైలీ ప్రాసెస్ట్‌ ఫుడ్స్‌ తీసుకున్నట్లే అవి మెమొరీ లాస్‌ వచ్చే ప్రమాదం ఉందని పరిశోధకులు హెచ్చరిస్తున్నారు. వీటిని నిరూపించే ప్రయత్నంలో భాగంగా పరిశోధకులు ఎలుకలకు ఈ హైలీ ప్రాసెస్ట్‌ ఫుడ్స్‌ అందించగా.. వారి మెదడుపై ప్రభావం చూపాయి.

ఈ సందర్భంగా ఒహియో స్టేట్‌ యూనివర్సిటీ సీనియర్‌ పరిశోధకులు రూత్ బారింటోస్ మాట్లాడుతూ.. ‘‘ఈ పరిణామాలన్నీ మెదడుపై చాలా త్వరగా ప్రభావం చూపుతున్నాయి. ముఖ్యంగా  ప్రాసెస్ చేసిన ఆహారాన్ని వృద్ధులు తీసుకుంటే.. వారిలో ఆకస్మిక జ్ఞాపకశక్తి లోపంతో పాటు అల్జీమర్స్ వ్యాధికి దారితీస్తుందని కనుగొన్నాం. వీటన్నింటనీ దృష్టిలో పెట్టుకొని ప్రాసెస్ చేసిన ఆహారాన్ని పరిమితంగా తీసుకొని ఒమేగా -3 ఫ్యాటీ యాసిడ్ DHA అధికంగా తీసుకున్నట్లైతే ఆ సమస్యను నిరోధించవచ్చు’’ అని తెలిపారు.

Related Articles

Leave a Comment

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More