TheIndiaMedia website is for sale. Those who are interested to purchase can reach out to us at theindiamedia2020@gmail.com
Home » News » తండ్రి తరఫున పద్మవిభూషణ్ అవార్డ్ అందుకున్న ఎస్పీ చరణ్

తండ్రి తరఫున పద్మవిభూషణ్ అవార్డ్ అందుకున్న ఎస్పీ చరణ్

by Murthy

ప్రముఖ దివంగత గాయకుడు, గాన గాంధర్వుడు ఎస్పీ బాలసుబ్రమణ్యంకు మరణాంతరం పద్మవిభూషణ్ అవార్డును ప్రకటించిన సంగతి తెలిసిందే. ఈ ఏడాది పద‍్మ అవార్డుల ప్రదానోత్సవం రాష్టపతి భవన్‌లో ఘనంగా జరిగింది. రాష్ట్రపతి రామ్‌నాథ్‌ కోవింద్‌ ఈ అవార్డులను ప్రదానం చేశారు. 2020లో సినీ పరిశ్రమకు ఆయన అందించిన సేవలకు గాను బాల సుబ్రమణ్యంకు పద్మ భూషన్‌ అవార్డను భారత ప్రభుత్వం ప్రదానం చేసింది.  గత ఐదు దశాబ్దాలుగా తన గానామృతంతో సంగీత ప్రియులను, ప్రేక్షకులను అలరించారు.. గానగంధర్వుడు ఎస్పీ బాల సుబ్రహ్మణ్యం.. కరోనా బారినపడి చెన్నైలోని ఎంజీఎం ఆసుపత్రిలో చికిత్స పొందుతూ గతేడాది సెప్టెంబర్ 25న బాలు కన్నుమూశారు.   రిపబ్లిక్ డే సందర్భంగా కేంద్రం ఈ అవార్డులను ప్రకటించింది. అయితే బాల సుబ్రమణ్యానికి తమిళనాడు కోటాలో అవార్డును అందించింది. మరో ప్రముఖ గాయిని కే.ఎస్ చిత్రకు ప్రభుత్వం పద్మ భూషణ్ అవార్డు అందించనున్నట్లు కేంద్రం ప్రకటించింది. 

ఈ అవార్డును ఆయన తనయుడు ఎస్పీ చరణ్‌ అందుకున్నారు. కాగా 2020లో మొత్తంలో 119మందిని పద్మాలు వరించాయి. 119 మందిలో 29 మంది మహిళలు ఉండగా… 16 మందికి చనిపోయిన అనంతరం అవార్డును ప్రకటించారు. స్టార్‌ షట్లర్‌ పీవీ సింధుకు పద్మవిభూషణ్, బాలీవుడ్‌ నటికి కంగనా రనౌత్‌కు పద్మశ్రీ, నిర్మాత ఏక్తా కపూర్‌, సింగర్‌ అద్నాన్‌ సమీకి పద్మశ్రీ, నిర్మాత కరణ్‌ జోహార్‌కు పద్మ శ్రీ అవార్డును రాష్ట్రపతి ప్రదానం చేశారు.

Related Articles

Leave a Comment

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More