కస్టమర్స్ కి ఎప్పటికప్పుడు లేటెస్ట్ వెర్షన్ మొబైల్స్ అందించడంలో ఎప్పుడు ఒక అడుగు ముందుండే సాంసంగ్ జూన్‌లో రిలీజ్ చేసిన రెండు లేటెస్ట్ ఫోన్ మోడల్స్ ధరల్ని తగ్గించి, కస్టమర్స్ కి ఫెస్టివల్ ఆఫర్ ఇచ్చింది. లేటెస్ట్ మోడల్ సాంసంగ్ ఫోన్ కొనాలి అనుకునేవారికి ఇది ఖచ్చితంగా శుభవార్తే.. !
సాంసంగ్ గెలాక్సీ ఎం11 స్మార్ట్‌ఫోన్ లోని 3జీబీ+32జీబీ వేరియంట్ పై రూ.500 తగ్గించి దాన్ని ఒరిజినల్ ధర రూ.11,499 కాగా ఇప్పుడు అదే ఫోన్ ని రూ.10,999 కే అందిస్తుంది సాంసంగ్. దానితో పాటు అదే మోడల్ లో 4జీబీ+64జీబీ వేరియంట్‌పై రూ.1,000 తగ్గింది దాన్ని ఒరిజినల్ ధర .12,999 కాగా ఇప్పుడు రూ.11,999 ధరకు అందిస్తుంది సాంసంగ్.
సెకండ్ మోడల్ అయిన సాంసంగ్ గెలాక్సీ ఎం01 స్మార్ట్‌ఫోన్ లో ని 3జీబీ+32జీబీ వేరియంట్ పై సాంసంగ్ రూ.400 తగ్గించింది.
దీంతో ఎం01 మొబైల్ ధర రూ.8,399 నుంచి రూ.7,999 ధరకు తగ్గింది.
ఈ తగ్గించిన ధరలతోనే సాంసంగ్ స్మార్ట్ఫోన్లను అమెజాన్ ఇండియాతో పాటు సాంసంగ్ అధికారిక ఇ-స్టోర్‌లో కస్టమర్లు కొనవచ్చు.
సాంసంగ్ గెలాక్సీ ఎం11 స్పెసిఫికేషన్స్:
- సాంసంగ్ గెలాక్సీ ఎం11 ఫోన్ లో 6.4 అంగుళాల హెచ్డీ+ ఇన్ఫినిటీ ఓ డిస్ప్లే ఉంటుంది.
- ఈ మోడల్ లో రెండు మెమరీ వేరియేషన్స్ తో మనకు లభిస్తాయి మొదటిది 3జీబీ+32జీబీ, రెండోది 4జీబీ+64జీబీ వేరియంట్ .

- ఈ రెండు మోడల్స్ లో కుడా మనం కావాలంటే మైక్రోఎస్డీ కార్డుతో స్టోరేజీ పెంచుకోవచ్చు.
- సాంసంగ్ గెలాక్సీ ఎం11 లో క్వాల్కమ్ స్నాప్‌డ్రాగన్ 450 ప్రాసెసర్ ఆధారంగా పనిచేస్తుంది.
- కెమెరా స్పెసిఫికేషన్స్ విషయానికి కొస్తే రియర్ కెమెరా 13+5+2 మెగాపిక్సెల్ కాగా, ఫ్రంట్ కెమెరా 8 మెగాపిక్సెల్.
- ఇందులో 5000ఎంఏహెచ్ బ్యాటరీ ఉంటుంది.
- ఈ మొబైల్ ఫోన్ ఆండ్రాయిడ్ 10 ఆపరేటింగ్ సిస్టమ్‌తో పనిచేస్తుంది.
- సాంసంగ్ గెలాక్సీ ఎం11 త్రీ కలర్స్ బ్లూ, బ్లాక్, వయొలెట్లో మనకు అందుబాటులో ఉన్నాయి.
సాంసంగ్ గెలాక్సీ ఎం01 స్పెసిఫికేషన్స్ :
- సాంసంగ్ గెలాక్సీ ఎం01 మోడల్ లో డిస్ప్లే సైజు 5.71 అంగుళాల హెచ్డీ+ ఇన్ఫినిటీ వీ డిస్ప్లే ఉంటుంది.
- కాగా ఇది కేవలం 3జీబీ+32జీబీ మేమెవరి సైజు వేరియంట్ లోనే లభిస్తుంది.
- మనకు ఎక్సెస్ మెమరీ కావాలంటే మైక్రోఎస్డీ కార్డుతో స్టోరేజీ పెంచుకోవచ్చు.

- సాంసంగ్ గెలాక్సీ ఎం01 లో క్వాల్కమ్ స్నాప్‌డ్రాగన్ 439 ప్రాసెసర్ ఉంటుంది.
- ఈ ఫోన్ లో కెమెరా స్పెసిఫికేషన్ విషయానికి వస్తే రియర్ కెమెరా 13+2 మెగాపిక్సెల్ కాగా ఫ్రంట్ కెమెరా 5 మెగాపిక్సెల్ ఉంటుంది.
- ఈ మోడల్ ఫామ్బ్యానే లో బాటరీ కెపాసిటీ 4000ఎంఏహెచ్ ఉంటుంది.
- సాంసంగ్ గెలాక్సీ ఎం01 లో ఆండ్రాయిడ్ 10 ఆపరేటింగ్ సిస్టమ్ సాఫ్ట్వేర్ ఉంటుంది.
- ఈ ఫోన్ లో అడిషనల్ ఫీచర్స్ అయిన ఫేస్ అన్‌లాక్ ఫీచర్ కూడా ఉంది.
- ఈ మోడల్ ఫోన్ మార్కెట్ లో త్రి కలర్స్ బ్లాక్, బ్లూ, రెడ్ లో అందుబాటులో ఉంది.