TheIndiaMedia website is for sale. Those who are interested to purchase can reach out to us at theindiamedia2020@gmail.com
Home » News » క్రెడిట్, డెబిట్ కార్డ్ వాడకం పై RBI కొత్త రూల్స్ | RBI’s New Credit and Debit Card Rules From October 1

క్రెడిట్, డెబిట్ కార్డ్ వాడకం పై RBI కొత్త రూల్స్ | RBI’s New Credit and Debit Card Rules From October 1

by Bellamkonda

ఈ రోజుల్లో  ఎవ్వరు చూసిన  డిజిటల్ ట్రాన్సక్షన్స్  కి ఎక్కువ మొగ్గు చూపుతూ ఆన్లైన్ ప్యేమెంట్స్ లేదా కార్డ్లెస్ ప్యేమెంట్స్ కి ఎక్కువ ప్రాధాన్యం ఇస్తున్నారు. ఇదే తరహాలో ఆన్లైన్ ట్రాన్సక్షన్స్ తో పాటు ఆన్లైన్ ఫ్రాడ్స్ కూడా రోజు రోజుకి పెరుగుతున్నాయి. ఇప్పుడు ఆన్లైన్ ఫ్రాడ్స్ ని అరికట్టాడని  రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా  ఏటీఎం , డెబిట్ మరియు  క్రెడిట్ కార్డ్ వినోయోగం పై కొత్త రూల్స్ ప్రవేశ పెట్టింది. కొత్త రూల్స్ తో డిజిటల్ మరియు ఆన్లైన్  ట్రాన్సక్షన్స్ మరింత సురక్షితంగా మార్చబోతోంది ఆర్‌బీఐ.

ఆ కొత్త రూల్స్ అక్టోబర్ 1 నుండి అమల్లోకి వస్తాయి. భారతీయ రిజర్వ్ బ్యాంక్ (RBI) కొత్తగా ప్రవేశపెట్టిన రూల్స్ అన్ని క్రెడిట్ కార్డ్  మరియు డెబిట్ కార్డు ట్రాన్సాక్షన్స్ కు వర్తిస్తాయి . 

Digital transaction at govt agencies rises five times in two years: Official

డెబిట్ లేదా క్రెడిట్ కార్డు వాడి కాంటాక్ట్‌లెస్, కార్డ్‌లెస్ లేదా  ఆన్‌లైన్ ట్రాన్సాక్షన్స్ చేయాలనుకునే వారు ఈ కొత్త RBI రూల్స్ ప్రకారం కేవలం వారికి అవసరమైన ట్రాన్సాక్షన్స్  ఆప్షన్స్  మాత్రమే తమ కార్డుకి ఆక్టివేట్  చేయాల్సి ఉంటుంది. 

అలాగే ఇప్పటికే  క్రెడిట్ కార్డ్, డెబిట్ కార్డులు ఉండి వాటిని మనం వాడుతుంటే అందులోని ఇంటర్నేషనల్, ఆన్‌లైన్, కాంటాక్ట్‌లెస్ ట్రాన్సాక్షన్స్ అక్టోబర్ 1 నుండి ఆగిపోతాయి. ఆ సర్వీసెస్ ని కొనసాగించడానికి  తప్పనిసరిగా రిక్వెస్ట్ చేయాల్సి ఉంటుంది.  యూజర్ బ్యాంకు ని రిక్వెస్ట్ చేసిన 24 గంటల్లో ఈ సర్వీసులు యాక్టివేట్ అవుతాయి. 

RBI ఇప్పటి నుండి  డెబిట్ మరియు క్రెడిట్  కార్డుల ద్వారా అంతర్జాతీయ ట్రాన్సక్షన్స్ తీసివేయాలని బ్యాంక్స్ ని ఆదేశించింది.  అంతర్జాతీయ ట్రాన్సక్షన్స్  ఆప్షన్ ని డిఫాల్ట్ గా వినాయగదారులకు అందించకుండా ఈ ఇంటర్నేషనల్ యూజేస్ ఆప్షన్  కావాలని ఎవ్వరైతే  అద్దుగుతారో వారికీ మాత్రమే ఈ ఆప్షన్ అందించాలని RBI బ్యాంక్స్ కి తెలిపింది. 

 ఇప్పటి నుండి బ్యాంక్స్ యూజర్స్  కి కార్డులు జారీ చేసేప్పుడు ఏటీఎంలు, పీఓఎస్ టెర్మినల్స్‌ మాత్రమే అందుబాటులో ఉంటాయి. అంటే వినోయోగదారుడు కొత్త కార్డు వచ్చినప్పుడు అందులో డిఫాల్ట్‌గా ఇంటర్నేషనల్ యూజేస్ ఆప్షన్ ఉండదు. కేవలం డొమెస్టిక్ యూసేజ్‌కి మాత్రమే అనుమతి ఉంటుంది. ఇంటర్నేషనల్ ట్రాన్సాక్షన్స్ కావాలనుకుంటే బ్యాంకు వెబ్‌సైట్ లేదా మొబైల్ బ్యాంకింగ్ ద్వారా యూజర్స్ బ్యాంకు నుండి పర్మిషన్ తీసుకోవాల్సిందే. 

ట్రాన్సక్షన్స్ పై ఈ కొత్త రూల్స్ RBI గతంలోనే రూపొందించింది, కానీ కరోనా వైరస్ లొక్డౌన్  కారణంగా ఇవి సరిగ్గా అమలు కాలేదు కానీ ఇప్పుడు వీటిని అక్టోబర్ 1 నుంచి RBI కఠినంగా అమలు చేయబోతోంది.

Related Articles

Leave a Comment

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More