కన్నడ సూపర్ స్టార్ పునీత్ రాజ్ కుమార్ హఠత్మరణం ను అభిమానులు జీర్ణించుకోలేక పోతున్నారు. పునీత్ మృతి చెంది వారం దాటుతున్నా కూడా ఇంకా అభిమానులు శోఖం నుండి బయటకు రాలేక పోతున్నారు. కొందరు పునీత్ రాజ్ కుమార్ గురించి ఆలోచిస్తూ డిప్రెషన్ లోకి వెళ్లి పోయి చివరకు ఆత్మహత్య వరకు వెళ్తున్నారట. కొందరు ఆత్మహత్య చేసుకుంటూ ఉంటే మరి కొందరు గుండె పగిలి చనిపోతున్నారు. పునీత్ అభిమానుల గుండెలు పలుగుతున్న ఈ సమయంలో కన్నడ ఇండస్ట్రీ వర్గాల వారు మరియు మీడియా వారు ఆ చావులను ఆపేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. ఈ అభిమానుల ఆత్మహత్యలపై పునీత్ రాజ్ కుమార్ భార్య శ్రీమతి అశ్విని స్పందించారు. ఇలా అఘాయిత్యాలకు ఎవరు పాల్పడవద్దని ఆమె కోరుతూ ఒక ప్రకటనను విడుదల చేశారు.
పునీత్ మరణం మా కుటుంబానికి తీరని లోటు.. అప్పు లేడన్న విషయం మేము కూడా జీర్ణించుకోలేకపోతున్నాం.. ఇలాంటి సమయంలో మీరు చూపిస్తున్న ఈ ఎనలేని ప్రేమకు మేము ఎప్పుడు రుణపడి ఉంటాం. ఆయన మన మధ్యలేకపోయినా మన గురించే ఆలోచిస్తూ ఉంటారు. ఆయనే లేని లోటును మేము అనుభవిస్తున్నాం.. మీ కుటుంబాలకు అలంటి పరిస్థితి రానివ్వకండి. ఆత్మహత్యలకు పాల్పడి కుటుంబాన్ని ఒంటరిగా వదిలేయకండి. దయచేసి ప్రతి ఒక్కరు దైర్యంగా ఉండండి.. ఎటువంటి అఘాయిత్యాలకు పాల్పడవద్దు” అంటూ విజ్ఞప్తి చేశారు. మరి పునీత్ అభిమానులు ఆమె మాట ఎంతవరకూ గౌరవిస్తారో చూడాలి.