TheIndiaMedia website is for sale. Those who are interested to purchase can reach out to us at theindiamedia2020@gmail.com
Home » News » శాండల్ వుడ్ లో విషాదం: పవర్ స్టార్ పునీత్ ఆరోగ్యం విషమం.

శాండల్ వుడ్ లో విషాదం: పవర్ స్టార్ పునీత్ ఆరోగ్యం విషమం.

by Murthy

శాండల్‌వుడ్ పవర్‌స్టార్ నటుడు పునీత్ రాజ్ కుమార్ గుండెపోటుతో ఆసుపత్రిలో చేరారు. ప్రస్తుతం ఆయన బెంగళూరులోని విక్రమ్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. వైద్యులు ఇప్పుడు ఈసీజీ చేస్తున్నారు. ఇంట్లో జిమ్‌లో వర్కౌట్ చేస్తున్న సమయంలో పునీత్ కుప్పకూలిపోయాడు. వెంటనే అతని సన్నిహితులు పునీత్ ను ఆసుపత్రికి తరలించినట్లు సమాచారం. పునీత్ రాజ్ కుమార్ వయస్సు 46 ఏళ్లు.. కన్నడ కంఠీరవ రాజ్ కుమార్ మూడో కుమారుడు పునీత్ రాజ్ కుమార్ యువరత్న సినిమా ద్వారా తెలుగు ప్రేక్షకులకు దగ్గరయ్యాడు పునీత్.

పునీత్ రాజ్ కుమార్ అన్నయ్య శివరాజ్ కుమార్ కుమార్తె నివేదిత.. పునీత్ కుటుంబ సభ్యులు.. క్రేజీ స్టార్ రవిచంద్రన్, నిర్మాతలు జయన్న, కేపీ శ్రీకాంత్ ఆసుపత్రికి చేరుకున్నారు. అలాగే కర్ణాటక ముఖ్యమంత్రి బసవరాజ్ బొమ్మై ఆసుపత్రికి చేరుకుని పునీత్ ఆరోగ్య పరిస్థితిని తెలుసుకున్నారు. ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉందని సమాచారం. విషయం తెలిసిన ఆయన అభిమానులు ఆసుపత్రి వద్దకు భారీ సంఖ్యలో తరలి వస్తుండడంతో ఆసుపత్రి చుట్టూ పోలీసులు భారీగా మోహరించారు. పునీత్ కుటుంబ సభ్యులను కర్ణాటక సీఎం పరామర్శించారు.

Related Articles

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More