TheIndiaMedia website is for sale. Those who are interested to purchase can reach out to us at theindiamedia2020@gmail.com
Home » News » తల్లిని చెరబట్టీ, కూతుర్నీ లొంగదీసుకోవాలనుకున్న కానిస్టేబుల్!..

తల్లిని చెరబట్టీ, కూతుర్నీ లొంగదీసుకోవాలనుకున్న కానిస్టేబుల్!..

by Murthy

ఓ కానిస్టేబుల్ కామ క్రీమహిళల రక్షణ కోసం ప్రభుత్వం ఎన్నో చట్టాలను ముందుకు తీసుకొస్తోంది. అమాయకులు తమ మాన, ప్రాణాలను కోల్పోతున్నారు. కానీ మృగాళ్ల కామ దాహం ఎక్కడా మారలేదు. మహిళను లొంగదీసుకోవడమే కాకుండా ఆమె కూతురిపై కూడా కన్నేసి, ఆమెపై కూడా అత్యాచారానికి పాల్పడడానికి ప్రయత్నించిన ఈ ఘటన స్థానికంగా సంచలనం రేపుతోంది. గుంటూరులోని ప్రభుత్వ ఆసుపత్రిలో ఒక మహిళ ఆయాగా పనిచేస్తోంది. ఆమె భర్త కొన్నేళ్ల క్రితం మృతి చెందడంతో ఒక కుమార్తె, ఇద్దరు కుమారులతో కలిసి నివాసముంటోంది. జీజీహెచ్ కి వచ్చే ఒక కానిస్టేబుల్ తో ఆమెకు పరిచయమయ్యింది. అనంతరం వారిద్దరూ స్నేహితులుగా మారారు. ఒకరోజు కానిస్టేబుల్, ఆయా ఇంటికి వెళ్లి, ఎవరు లేని సమయంలో ఆమెను లొంగదీసుకున్నాడు. ఈ విషయం ఎవరికైనా చెపితే లేనిపోని కేసులు పెట్టి జైల్లో పెట్టిస్తానని బెదిరించాడు. పిల్లల భవిష్యత్తును దృష్టిలో పెట్టుకొని ఆయా, కానిస్టేబుల్ ఆగడాలను బయట ఎక్కడ చెప్పలేదు. దీంతో రెచ్చిపోయిన అతను ఇంకా వారిని వేధించడం మొదలుపెట్టాడు.

ఇంట్లోనే మందు తాగుతూ, మహిళ కూతురిని కూడా అసభ్యంగా మాట్లాడేవాడు. దీంతో విసిగిపోయిన మహిళ.. కానిస్టేబుల్ బాగోతాలను పై అధికారులకు చెప్తానని బెదిరించడంతో.. ఆమెను నమ్మించడానికి రెండేళ్ల క్రితం ఒక గుడిలో ఆమె మెడలో తాళికట్టి పెళ్లి చేసుకున్నాడు. అయినా అతనిలో మార్పు రాలేదు. చివరికి మహిళ కూతురు పై కానిస్టేబుల్ కన్ను పడింది. వరుసకు కూతురు అవుతుంది అన్న విచక్షణ కూడా మరిచి ఇంట్లో ఎవరు లేని సమయంలో ఆమెతో అసభ్యంగా మాట్లాడడం, అత్యాచారం చేయడానికి ప్రయత్నించాడు. ఈ విషయాన్ని బాలిక తల్లికి చెప్పింది. ఇక అతగాడి ఆగడాలను తట్టుకోలేని మహిళ గుంటూరు అర్బన్ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేసింది. ప్రస్తుతం ఈ ఘటన స్థానికంగా సంచలనం రేపుతోంది. 

Related Articles

Leave a Comment

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More