కేంద్ర ప్రభుత్వం దీపావళి రోజున వాహనదారులకు తీపికబురు అందించింది. పెట్రోల్, డీజిల్‌పై ఎక్సైజ్ సుంకాన్ని భారీగా తగ్గించేసింది. దీంతో దేశవ్యాప్తంగా దేశీ ఇంధన ధరలు దిగొచ్చాయి. పెట్రోల్ రేటు రూ.5, డీజిల్ ధర రూ.10 మేర తగ్గింది. కొన్ని రాష్ట్రాల్లో ఇంకా ధరలు ఎక్కువగానే దిగొచ్చాయి. రాష్ట్రాలు కూడా పన్నులు తగ్గించాలని కేంద్రం సూచించింది. కేంద్రం ఎక్సైజ్ సుంకం తగ్గించిన తరువాత పెట్రోల్, డీజిల్ లేటెస్ట్ ధరలను ఒక్కసారి పరిశీలిస్తే.. దేశ రాజధాని ఢిల్లీలో నవంబర్ 9న లీటర్ పెట్రోల్ ధర రూ.103.97గా ఉండగా, లీటర్ డీజిల్ ధర రూ.86.67గా ఉంది. ముంబైలో లీటర్ పెట్రోల్ ధర రూ.109.98గా ఉండగా, లీటర్ డీజిల్ ధర రూ.94.14గా ఉండటం గమనార్హం. దేశంలో పలు ప్రాంతాల్లో పెట్రోల్ రేట్లను గమనిస్తే.. రాజస్థాన్‌లోని శ్రీగంగానగర్‌లో పెట్రోల్ ధర లీటరుకు రూ.116.34 వద్ద ఉంది.
అయితే మనదేశంలోనే ఉన్న … అండమాన్ నికోబర్లో పెట్రోల్ ధర రూ.82 వద్ద కొనసాగుతోంది. అంటే ఇక్కడ పెట్రోల్ ధర రూ.34 తక్కువగా ఉందని చెప్పుకోవచ్చు. అలాగే డీజిల్ కూడా రూ.23 తక్కువకే వస్తోంది. మరోవైపు అంతర్జాతీయ మార్కెట్లో ముడి చమురు ధరలు భారీగా పెరిగాయి. బ్రెంట్ క్రూడ్ ఆయిల్ ధర బ్యారెల్‌కు 1.12 శాతం పైకి కదిలింది. దీంతో బ్రెంట్ ధర 83.67 డాలర్లకు చేరింది. ఇక డబ్ల్యూటీఐ క్రూడ్ ఆయిల్ ధర 1.23 శాతం పెరిగింది.
హైదరాబాద్‌లో పెట్రోల్, డీజిల్ ధరల్లో ఎలాంటి మార్పు లేదు. పెట్రోల్ ధర స్థిరంగా ఉంది. లీటరుకు పెట్రోల్ ధర రూ.108.20 వద్దనే కొనసాగుతోంది. డీజిల్ ధర లీటరుకు రూ.94.62 వద్దనే స్థిరంగా కొనసాగుతోంది.