TheIndiaMedia website is for sale. Those who are interested to purchase can reach out to us at theindiamedia2020@gmail.com
Home » News » పాల అధిక దిగుబడికిచ్చే ఇంజక్షన్ – పశువులకీ మనుషులకీ ప్రమాదమే!..

పాల అధిక దిగుబడికిచ్చే ఇంజక్షన్ – పశువులకీ మనుషులకీ ప్రమాదమే!..

by Murthy

గేదెలు, ఆవులను మచ్చిక చేసుకోవడం మాని, త్వరగా పాలు ఇవ్వాలన్న ఉద్దేశంతో ప్రమాదకరమైన ఆక్సిటోసిన్‌ అనే హార్మోన్‌ ఇంజెక్షన్‌ వేస్తున్నారు. వీటి పాలు తాగిన వారు వ్యాధుల బారిన పడుతున్నారు. గేదెలు సైతం పునరుత్పత్తి శక్తిని కోల్పోతున్నాయి. వ్యాపారులు వీటిని దొడ్డిదారిన తెచ్చి విక్రయి స్తున్నారు. కొందరు రైతులు త్వరగా పాలు పితకాలన్న ఆత్రుతతో గేదెలకు ఈ ఇంజెక్షన్లు వేస్తున్నారు. గతంలో దూడ చనిపోతే తప్పనిసరి పరిస్థితుల్లోనే అదీ పశువైద్యాధికారి సూచన మేరకు మాత్రమే గేదెలకు ఈ ఇంజెక్షన్లు ఇచ్చేవారు.ఆక్సిటోసిన్ ఇంజక్షన్ ఇవ్వటం వల్ల పాలు ఉత్పత్తి చేసే గ్రంథుల చుట్టూ ఉన్న కణాలు సంకోచ వ్యాకోచాలు చెందుతాయి. దీంతో లోపల ఉన్న కండరాలన్నీ బయటకు తోసేలా పాలు ఎక్కవగా ఇచ్చేలా ఉపయోగపడుతుంది.

చాలా మంది రైతులు వీటిని ఇంజెక్షన్ రూపంలో రోజుకి ఒకటి నుంచి రెండు సార్లు అందిస్తున్నారు. దీని వల్ల పశువులకు తీవ్ర నష్టం అన్న విషయం రైతులు గుర్తించటంలేదు. ప్రభుత్వం దీన్ని అత్యవసరం అయితే కానీ ఉపయోగించకూడదని నిబంధన విధించినా క్షేత్ర స్థాయిలో ఫలితంలేకుండా పోతుంది.1960 ప్రివెన్షన్ ఆఫ్ క్రుయల్టీ టు యానిమల్స్ యాక్ట్ లోని సెక్షన్ 12 ప్రకారం ఆక్సిటోసిన్ ని వైద్యుల ప్రిస్కిప్షన్ లేకుండా అమ్మడం, కొనడం రెండూ చట్టరిత్యా నేరంగా పరిగణిస్తారు.

ఆక్సిటోసిన్ ఇంజెక్షన్ ఇచ్చిన గేదెలు, ఆవులు ఇచ్చిన పాలను తాగడం వల్ల మనుషుల్లోనూ చాలా రకాల దుష్ప ప్రభావాలు ఎదురవుతాయి. హార్మోన్ల అసమతౌల్యత ఎదురవ్వడం, పిల్లల్లో రజస్వల అయ్యే వయసు చాలా తగ్గిపోవటం, చిన్న పిల్లల్లో కంటి చూపు వంటి సమస్యలు కూడా ఎదురవుతాయి. పిల్లల్లో జాండిస్ వచ్చే అవకాశాలు, గుండె కొట్టుకునే వేగం పెరగడం, తగ్గడం జరుగుతుంది. అంతేకాదు వాంతులు రావడం, కళ్లు తిరగడం, ముక్కులో ఇరిటేషన్, నొప్పి, బ్రెయిన్ సెల్స్ ని తగ్గించి మతిమరుపు సమస్యలు వస్తాయి.

Related Articles

Leave a Comment

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More