TheIndiaMedia website is for sale. Those who are interested to purchase can reach out to us at theindiamedia2020@gmail.com
Home » News » బ్రహ్మీ ఏమిటయ్యా నీ లీలా! … అయ్యెయ్యో ఎందుకిలా??.

బ్రహ్మీ ఏమిటయ్యా నీ లీలా! … అయ్యెయ్యో ఎందుకిలా??.

by Murthy

నీతిన్ హీరోగా నటిస్తున్న ఈ మూవీకి ‘మాచర్ల నియోజక వర్గం’ అన్న టైటిల్ పెట్టినట్లు తెలుస్తోంది. ఎంఎస్ రాజశేఖర్ రెడ్డి దర్శకత్వంలో రాబోతోన్న సినిమాకు సంబంధించిన అప్డేట్ వచ్చింది. తాజాగా ఈ సినిమా విడుదల తేదీని ప్రకటించారు. ఈ క్రమంలో విడుదల చేసిన పోస్టర్ అందరినీ ఆకట్టుకుంటోంది. మాచర్ల నియోజకవర్గం సినిమా ఏప్రిల్ 29న విడుదల కానుందని ప్రకటిస్తూ విడుదల చేసిన పోస్టర్ అదిరిపోయింది. 1000 సినిమాలలో నటించి గిన్నీస్ బుక్ లో స్థానం పొందిన బ్రహ్మనందం కెరియర్ లో ఎన్నో సూపర్ హిట్స్ ఉన్నాయి. టాప్ హీరోలు కూడ తమ డేట్స్ ను బ్రహ్మీ డేట్స్ కు ఆటంకం కలగకుండా తమ డేట్స్ సద్దుబాటు చేసుకునే వారు అంటే బ్రహ్మీ ఏ స్థాయిలో తన ఆదిపత్యాన్ని ప్రదర్శించాడో అర్థం అవుతుంది.

నితిన్ లేటెస్ట్ గా నటిస్తున్న ‘మాచర్ల నియోజక వర్గం’ లో ఒక కీలక పాత్రకు బ్రహ్మీని ఎంపిక చేసినట్లు తెలుస్తోంది.షూటింగ్ స్పాట్ కు బ్రహ్మనందం తరుచూ ఆలస్యంగా రావడమే కాకుండా తన పాత్రకు ఎటువంటి సూచనలు ఇచ్చినా అది పట్టించు కోకుండా తనకు నచ్చిన విధంగా చేస్తూ సమస్యగా మారాడట.  అయితే బ్రహ్మ్మనందం తీరుపై నితిన్ ఫైర్ అయ్యాడంట. షూటింగ్ టైం కి బ్రహ్మీ రాలేదని, ఆయన వలన సమయం వృధా అయ్యిందని నితిన్ భావించి ఆయనను సినిమా నుంచి తొలగించినట్లు వార్తలు గుప్పుమంటున్నాయి.

పారితోషికం కూడా బాగానే ముట్టజెప్పారట. ఆయన తీరుతో విసిగిపోయిన యంగ్ హీరో ఇచ్చిన రెమ్యూనిరేషన్ గురించి కూడా ఆలోచించకుండా బ్రహ్మీ పాత్రను తొలగించి నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. మరి ఈ వార్తలో నిజమెంత ఉందొ తెలియాలంటే చిత్ర బృందం స్పందించాల్సిందే. ఈ వార్తలలో ఎన్ని నిజాలో తెలియకపోయినా ఇండస్ట్రీని  శాసించిన బ్రహ్మనందం పై ఇలాంటి గాసిప్పులు రావడం ఏమిటి అని చాలామంది ఆశ్చర్యపోతున్నారు..  

Related Articles

Leave a Comment

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More