మాజీ మంత్రి మండలి బుద్ధ ప్రసాద్ కుమారుడు వెంకట్రామ్ వివాహ రిసెప్షన్ వేడుక హైదరాబాదులో జరిగింది. ఈ వేడుకకు మెగాస్టార్ చిరంజీవి, జనసేనాని పవన్ కళ్యాణ్ హాజరయ్యారు. మెగా సోదరుల రాకతో పెళ్లి వేదిక వద్ద కోలాహలం నెలకొంది. చిరంజీవి, పవన్ కళ్యాణ్ వధూవరులకు ఆశీర్వాదాలు అందజేశారు. అనంతరం మండలి బుద్ధ ప్రసాద్ కుటుంబసభ్యులతో కలిసి ఫొటోలు దిగారు. సోషల్ మీడియాలో ఇందుకు సంబంధించిన ఫొటోలు, వీడియోలు చక్కర్లు కొడుతున్నాయి.
రాజకీయ నాయకులు, మరియు సినీ పరిశ్రమ కి చెందిన పలువురు ప్రముఖులు తరచూ పలు కార్యక్రమాల్లో కలవడం మనం చూస్తూనే ఉంటాం. తాజాగా మెగా బ్రదర్స్ అయిన మెగాస్టార్ చిరంజీవి, పవన్ కళ్యాణ్ లు ఇద్దరు కూడా రాజకీయ నాయకులు అయిన మండలి బుద్ధ ప్రసాద్ గారి కొడుకు పెళ్లి వేడుకకు హాజరు అవ్వడం ఈ వేడుక లో మెగా బ్రదర్స్ కలిసి ముచ్చటించడం జరిగింది. మెగా బ్రదర్స్ లో మెగాస్టార్ చిరంజీవి సినిమాల్లో పూర్తి గా బిజిగా ఉండగా, పవన్ కళ్యాణ్ ఇటు వరుస సినిమాలతో బిజీగా ఉంటూనే, రాజకీయాల్లో కూడా యాక్టిివ్ గా ఉంటున్నారు.
రాజకీయం సినిమా ఎప్పుడూ అభిమానులను అలరిస్తూనే ఉంటాయి. అందులోనూ ఈ రెండు రంగాల్లో తమదైన స్టైల్లో దూసుకుపోయే మెగాపవర్ ఒకే వేదికమీద చూడటం అభిమానులకి కన్నుల పండగే అని చెప్పాలి. చిరు గాయంతోనే పెళ్ళికి హాజరవ్వడం విడుదలైన ఈ చిత్రాల్ని ఫ్యాన్స్ వైరల్ చేస్తున్నారు