చిన్నప్పటినుండి ఎంతో గారభంగా పెంచుకున్న తండ్రే కన్నకూతురి తలనరికి ఆ తలను చేతిలో పట్టుకొని వీధుల్లో తిరుగుతూ గ్రామస్థులను భయాందోళనలకు గురిచేసిన ఘటన ఉత్తర ప్రదేశ్ లోని పండితారాలో చోటుచేసుకుంది.
వివరాలలోకి వెళ్తే కూతురు ఎవరినో ప్రేమించిందన్న అనుమానంతో కన్నతండ్నే తన కూతురి తలను నరికాడు. ఉత్తర ప్రదేశ్ లోని లక్నోకు 200 కిలోమీటర్ల దూరంలో ఉన్న పండితారాలో సర్వేశ్ కుమార్ అనే వ్యక్తి నరికేసిన తన కూతురు తలతో విధుల్లో తిరుగుతుండడం గమనించిన గ్రామస్తులు ఉల్లిక్కిపడ్డారు. వెంటనే పోలీసులు సమాచారం అందించారు. పోలీస్ విచారణలో తండ్రి నిజాన్ని ఒప్ప్పుకున్నాడు.
పోలీస్ ఆ తలా ఎవరిదీ అని అడిగినప్పుడు అతను ఏమాత్రం భయంగాని బాధ గాని లేకుండా, అది తన కూతురి తలే అని నిర్భయంగా చెప్పాడు. తన కూతురు ఒక అబ్బాయితో సంబంధం పెట్టుకుని తన పరువు తీసేసిందనీ అందుకే ఈ హత్య చేశానని చెప్పాడు.ఆ తర్వాత అతనిపై పోలీసులు కేసు నమోదు చేసుకుని విచారిస్తున్నారు.