TheIndiaMedia website is for sale. Those who are interested to purchase can reach out to us at theindiamedia2020@gmail.com
Home » News » పర్స్ కొంటే పాస్ పోర్ట్ ఉచితం!..ఎక్కడా? ఎలా!?.

పర్స్ కొంటే పాస్ పోర్ట్ ఉచితం!..ఎక్కడా? ఎలా!?.

by Murthy

కేరళ రాష్ట్రంలోని వాయినాడ్ జిల్లాలో ఓ వ్యక్తి అమెజాన్‌లో పర్సు ఆర్డర్ చేస్తే… అతనికి పర్సుతో పాటు… అందులో పాస్ పోర్టు కూడా వచ్చింది. జిల్లా కణియంబెట్టా అనే గ్రామానికి చెందిన మిథున్ బాబు అనే వ్యక్తి   అమెజాన్‌లో అక్టోబర్ 30వ తేదీన ఓ పర్సు ఆర్డర్ చేశాడు. అయితే ఆయనకు ఆర్డర్ చేసిన రెండు రోజుల తర్వాత పర్సు డెలివరీ అయ్యింది. అయితే నచ్చిన పర్సు వచ్చిందని ఆనందంగా తెరిచి చూసిన ఆయన అనుకోని షాక్ తగిలింది. పర్సు లోపల ఓ పాస్ పోర్టు ఉండడం చూసి మిథున్ అవాక్కయ్యాడు. అయితే అతడు అది  ఏదో డమ్మీ పాస్ పోర్టు అయి ఉంటుందని ముందుగా భావించాడు.  తర్వాత దానిపై ఉన్న వివరాలు  చూసి ఆరా తీశాడు. అది ఒరిజినల్ అని తేలింది. త్రిసూర్ ప్రాంతానికి చెందిన పాస్ పోర్టుగా గుర్తించాడు. అమెజాన్ కస్టమర్ కేర్ నుంచి మిథున్‌కు సరైనా సమాధానం లభించలేదు. ఇకపై అలాంటి పొరపాట్లు జరగకుండా చూస్తామంటూ కట్ చేశారు కస్టమర్ కేర్ ప్రతినిధులు.

ట్రావెల్ డాంక్యుమెంట్‌లో ఉన్న వివరాలు ఆధారంగా అతడి అడ్రస్ కనుక్కున్నాడు. దీంతో మిథున్ ఆర్డర్ చేసుకున్న పర్సులోకి సాలిహ్ పాస్ పోర్టు ఎలా వచ్చిందన్న మిస్టరీ వీడింది.  దీంతో పాస్ పోర్టు ఓనర్‌ అయినామొహమ్మద్ సాలిహ్‌ను కాంటాక్ట్ చేశాడు.మొహమ్మద్ సాలిహ్ కూడా అమెజాన్‌లో ఆర్డర్ చేశాడు. అయితే ఆ పర్సు తనకు నచ్చకపోవడంతో తిరిగి రిటర్స్ చేశాడు. అయితే రిటర్న్ చేసే సమయంలో అతడు తన పాస్ పోర్టు నుంచి అందులోని ఉంచిన విషయం మరిచిపోయాడు. పర్సును అలాగే రిటర్న్ చేశాడు.

అయితే అలాంటి పర్సునే బుక్ చేసుకున్న మిథున్ బాబుకు అమెజాన్ అదే పర్సును డెలివరీ చేసిందన్న విషయం బయట పడింది. అయితే రిటర్న్ చేసిన వస్తువుల్ని ఏ మాత్రం చెక్ చేయకుండా నిర్లక్ష్యంగా వ్యవహరించిన అమెజాన్ సంస్థ తిరిగి కస్టమర్లకు డెలివరీ చేస్తుందన్న సంగతి ఈ విషయంతో బయటపడింది. సో ఆర్డర్ రిటర్న్ ఇచ్చినప్పుడు జాగ్రత్త గా చెక్ చేసుకోండి. అలాగే ఆర్డర్ సరిగా లేకపోయినా వెంటనే స్పందించండి.

Related Articles

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More