TheIndiaMedia website is for sale. Those who are interested to purchase can reach out to us at theindiamedia2020@gmail.com
Home » News » అటు ఎన్నికలు… ఇటు పండగలు!.. మళ్ళీ పెరుగుతోన్న కవిత ప్రాభవం.

అటు ఎన్నికలు… ఇటు పండగలు!.. మళ్ళీ పెరుగుతోన్న కవిత ప్రాభవం.

by Murthy

అసెంబ్లీ ఎన్నికలు రెఫరెండం అవుతాయి కానీ .., మధ్యలో వచ్చే ఉప ఎన్నికలు కాదని ఎద్దేవా చేశారు కవిత. బిజెపి మాకు ప్రధాన పోటీ దారు అని మేము అనుకోవడం లేదని… టీఆరెస్ నుండి బయటకు వెళ్లి విమర్శించిన వాళ్ళు బాగుపడ్డట్లు చరిత్రలో లేదని పేర్కొన్నారు కల్వకుంట్ల కవిత. తెలంగాణ కి కేసీయార్ ఒక వజ్రాయుధమని… టీఆరెస్ పార్టీని దేశం లోని అన్ని ప్రాంతీయ పార్టీలు ఆదర్శంగా తీసుకున్నాయని తెలిపారు. ఇప్పుడు ప్రభుత్వం కూడా ఆదర్శంగా తీసుకుంటున్నాయని.. వరంగల్ విజయ గర్జన సభను విజయవంతం చేయాలని పిలుపు నిచ్చారు కవిత. 

 తెలుగు యూనివర్సిటీ లో బతుకమ్మ సంబరాలు జరిగాయి. ఈ కార్యక్రమానికి తెలంగాణ గవర్నర్‌ తమిళ్‌ సై తో పాటు ఎమ్మెల్సీ కవిత కూడా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్సీ కవిత ఆసక్తి కర వ్యాఖ్యలు చేశారు. బతుకమ్మ పాటల లో ఉండే తెలుగు పదాల మీద పరిశోధన చేస్తే, తెలుగు బాష మరింత పరిపుష్టం అవుతుందని… తెలంగాణ జాగృతి తో పాటు, అనేక సంస్థలు బతుకమ్మ పండుగకు సంబంధించి పాత పాటలు సేకరిస్తున్నారని వెల్లడించారు.

ఎప్పుడైతే 2019 పార్లమెంట్ ఎన్నికల్లో ఓటమి పాలయ్యారో అప్పటినుంచి కవిత కాస్త రాజకీయాలకు దూరమయ్యారు.   దీంతో ఎమ్మెల్సీ పదవి ఇచ్చారు. ఎమ్మెల్సీ పదవి వచ్చాక కవిత నిదానంగా రాజకీయాల్లో యాక్టివ్ గా ఉండటం మొదలుపెట్టారు. ఆమె ఏదైనా మాట్లాడితే ఆ మాటలకు చాలా ప్రాధాన్యం ఉంటుంది. అటువంటిది ఆమె పార్టీ గురించి వ్యాఖ్యలు చేస్తే అందరు దాని గురించే చర్చించుకుంటారు. పైగా బతుకమ్మ పండగ వస్తుండటంతో కవిత మళ్ళీ తెలంగాణ పోలిటికల్ స్క్రీన్‌పై సందడి చేయడం మొదలుపెట్టారు.

Related Articles

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More