TheIndiaMedia website is for sale. Those who are interested to purchase can reach out to us at theindiamedia2020@gmail.com
Home » News » రాజు గారికి భార్యలు 700 మంది. శతాబ్దాలనాటి చెరుగని రికార్డ్ !..

రాజు గారికి భార్యలు 700 మంది. శతాబ్దాలనాటి చెరుగని రికార్డ్ !..

by Murthy

ఒకరు కాకుండా ఇంకా ఎక్కువ మందిని పెళ్లి చేసుకోవడానికి రాజులకు బహు భార్యత్వం అనుమతి ఉండేది. రాజులు కూడా ఇద్దరు ముగ్గురిని వివాహం చేసుకుంటూ ఉండేవారు. కొందరైతే పది పదిహేనుమందిని కూడా పెళ్లి చేసుకున్న దాఖలాలు ఉన్నాయి. కానీ, ఇజ్రాయిల్ కు చెందిన సులేమాన్ అనే రాజుఏకం గా 700ల పెళ్లిళ్లు చేసుకున్నాడు. ఆయనకు పెళ్లి చేసుకోవడం అంటే చాలా ఇష్టమట. అందుకే ఆయన నిత్య పెళ్లికొడుకులా ఉండేవాడట. ఎప్పుడు పెళ్లి చేసుకుంటూ ఉండేవాడు. ఏ దేశ పర్యటనకు వెళ్లినా.. అక్కడి దేశంతో సత్సంబంధం కోసమే ఆయన అక్కడి వారిని పెళ్లి చేసుకునే వారట. ఆయనకు 700 ల మంది భార్యలతో పాటు 300 మంది పరిచారికలు కూడా ఉన్నారట.

ఆయన భార్యలలో చాలా మంది విదేశీ యువరాణులు కూడా ఉన్నారు. ఆరోజుల్లోనే.. ఆయన పెళ్లి గురించి ప్రపంచమంతా చర్చించేవారు. అంతర్జాతీయం గా సంబంధాలను మెరుగు పరుచుకోవడానికి ఆయన ఎక్కువ పెళ్లిళ్లు చేసుకుంటున్నాడని చెప్పుకునేవారు. దీని కోసం సులేమాన్ ఫరాన్ కుమార్తెను కూడా వివాహం చేసుకున్నాడు. సులేమాన్ రాజు తన పాలనలో పెళ్లిళ్లు చేసుకోవటమే కాదు… ప్రసిద్ధ జెరూసలేం ఆలయాన్ని., చారిత్రాత్మక కోటలను . అనేక రాజ భవనాలను కూడా నిర్మించాడు. అయితే ఆయన చేసుకున్న పెళ్లిళ్ల సంఖ్యను మాత్రం ఇప్పటి వరకు ఎవరు బ్రేక్ చేయలేదు. 700లమంది భార్యలున్నా సులేమాన్ కు పిల్లల గురించి సమాచారం అందుబాటులో లేదు. సులేమాన్ పెళ్లిళ్ల ప్రస్తావన అనేక గ్రంథంలో ప్రస్తావించారు. ఇప్పటికీ ఎక్కువ ప్రాంతాల్లో ఇజ్రాయిల్ రాజు యొక్క వివాహాల గురించి చర్చిస్తూనే ఉంటారు.

Related Articles

Leave a Comment

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More