Home » News » పబ్ జీ గేమ్ సహా 118 చైనా యాప్స్ ని బాన్ చేసిన ఇండియా | Reason Behind India Banning PUBG Including 118 China Apps

పబ్ జీ గేమ్ సహా 118 చైనా యాప్స్ ని బాన్ చేసిన ఇండియా | Reason Behind India Banning PUBG Including 118 China Apps

by Bellamkonda

పాపులర్ ఆన్‌లైన్ గేమ్ పబ్జీ తో సహా 118 చైనా యాప్‌లను ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ చట్టం సెక్షన్ 69 ప్రకారం బాన్ చేస్తున్నట్టు భారత ప్రభుత్వం సెప్టెంబర్ 2న నిర్ణయం తీసుకుంది. సంచలన నిర్ణయాలకు ఎప్పుడూ కేర్ అఫ్ అడ్రెస్స్ గా పేరుపొందిన మోడీ ప్రభుత్వం మొదట్లో టిక్ టాక్ బాన్ చేసి ఇలాగే టిక్ టాక్ లవర్స్ కి షాక్ ఇచ్చింది, ఇప్పుడు అదే బాటలో పబ్జీ సహా 118 చైనా యాప్‌లను కూడా బాన్ చేస్తూ నిర్ణయం తీసుకుంది.

ఇండియా లో చాలామంది యంగ్ స్టార్స్ , స్టూడెంట్స్ ఈ పబ్జీ గేమ్ కి అడిక్ట్ అయిపోయారు. పబ్జీని దాదాపు 70 కోట్ల మంది ఇండియన్స్ డౌన్‌లోడ్‌ చేసుకొని ఆడుతున్నారు అలాంటి వారు ఇప్పుడు ఈ న్యూస్ తో అయోమయంలో పడ్డారు.

ఇండియా బోర్డర్ లో భారత్ చైనా మధ్య ఉద్రిక్తత నెలకొన్న నేపథ్యంలో భారత ప్రభుత్వం చైనాకి బుధ్ధి చెప్పేందుకే 118 చైనా యాప్‌లను బాన్ చేసింది. భారతదేశం యొక్క సార్వభౌమాధికారం మరియు సమగ్రత తో పాటు సైబర్‌స్పేస్ భద్రత కోసమే ఈ నిర్ణయం తీసుకున్నట్టు భారత ప్రభుత్వం వెల్లడించింది.

ఈ న్యూస్ విన్న పబ్జీ గేమ్ లవర్స్ మాత్రం ఇంకా ఈ షాక్ నుండి కోలుకోలేదు, పిల్లల్లో నేరప్రవృత్తి పెంచేలా ఉన్న పబ్జీ గేమ్ ని ఇండియాలో బాన్ చెయ్యాలని చాల మంది తల్లిదండ్రులు ప్రభుత్వాన్ని ఎప్పడి నుండో డిమాండ్ చేస్తున్నారు.

కేవలం పబ్జీ ఆడొద్దు అన్నందుకే దానికి అలవాటు పడిన పిల్లలు ఎందరో సూసైడ్ కూడా చేసుకున్నారు. అలాంటి నేపథ్యంలో భారత ప్రభుత్వం పబ్జీ గేమ్ బాన్ చెయ్యడం పై అందరిలో ఆసక్తి నెలకొంది.

పబ్జీ పాటు బైడు, క్యామ్‌కార్డ్‌, విచాట్‌ రీడింగ్‌, టెన్సెంట్‌ వీన్‌, సైబర్‌ హంటర్‌, లైఫ్‌ ఆఫ్టర్‌ వంటి 118 చైనా యాప్‌లను ప్రభుత్వం నిషేధించింది. ఇప్పుడు పబ్జీకి బానిసలుగా మారిన పబ్జీ లవర్స్ పై ఈ బాన్ ఎలాంటి ప్రభావం చూపిస్తుందో వేచి చూడాల్సిందే.

అయితే కేవలం పబ్జీ తో సహా 118 చైనా యాప్‌లను బాన్ చెయ్యడం వల్ల భారతదేశానికి పెద్దగా ఉపయోగం ఏమి ఉండదని, కేవలం ఇది మోడీ ప్రభుత్వం ప్రజల ద్రుష్టి నిరోద్యగత నుండి మరలించేందుకు చేస్తున్న స్ట్రాటజీ అని ప్రతిపక్ష పార్టీస్ విమర్శిస్తున్నాయి.

అంతే కాకుండా కేవలం చైనాకి సంభిందించిన యాప్స్ ని బాన్ చేయడం వల్ల చైనాకి పెద్దగా నష్టం ఉండదని, చైనా కి సంబందించిన అన్ని ప్రొడక్ట్స్ ని బాన్ చేస్తేనే చైనా కి బుద్ధి వస్తుంది అని పలువురు నేతలు విమర్శిస్తున్నారు.

Related Articles

Leave a Comment

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More

You cannot copy content of this page