మరికొద్ది రోజుల్లో దీపావళి రాబోతుంది.. పెరుగుతున్న వాయు కాలుష్యాన్ని నివారించడానికి చాలా రాష్ట్రాలు బాణసంచా వాడకాన్ని నిషేధించాయి. అయినప్పటికీ, అనేక రాష్ట్రాల ప్రజలు సాధారణ బాణసంచా గ్రీన్ క్రాకర్లను కాల్చడానికి మరియు విక్రయించడానికి కూడా అనుమతిస్తున్నాయి. దీపావళి క్రాకర్స్ లో కూడా గ్రీన్ రెవెల్యూషన్ వచ్చింది. అవే గ్రీన్ కాకర్స్. మనం వాడే క్రాకర్స్ కాలుష్యరహితమైనవి కాదు. సీఎస్ఐఆర్ అంటే కౌన్సిల్ ఆఫ్ సైంటిఫిక్ అండ్ ఇండస్ట్రియల్ రీసెర్చ్ శాస్త్రవేత్తలు కాలుష్యరహిత టపాసుల తయారీని పేర్కొన్నారు. అవే మనం ముందు చెప్పుకున్న గ్రీన్ కాకర్స్.
ఢిల్లీ, దాని పరిసర ప్రాంతాల్లో సాధారణ బాణాసంచా అమ్మకాలు, కొనుగోళ్లను సుప్రీం కోర్టు 2018, అక్టోబర్ నెలలో నిషేధించింది. సాధారణ బాణాసంచాను ముందే కొనుగోలు చేసి నిల్వ చేసుకున్నామని, ఇంత త్వరగా ‘గ్రీన్ క్రాకర్స్’ అందుబాటులోకి రావడం దుకాణందారులు చేసుకున్న విజ్ఞప్తి మేరకు సుప్రీం కోర్టు షరతులతో కూడిన మినహాయింపులు ఇచ్చింది. ఈ ఏడాది నుంచి మాత్రం సాధారణ బాణాసంచాను అమ్మరాదని, గ్రీన్ కాకర్స్‌ను మాత్రమే అమ్మాలని నిక్కచ్చిగా చెప్పింది. అలాగే గ్రీన్ క్రాకర్స్ ఫార్ములాను రూపొందించాల్సిందిగా ఢిల్లీలోని ‘నేషనల్ ఎన్విరాన్మెంటల్ ఇంజనీరింగ్ రీసర్చ్ ఇనిస్టిట్యూట్’ను సుప్రీం కోర్టు ఆదేశించింది.
కొత్తగా తయారు చేస్తోన్న గ్రీన్ క్రాకర్స్‌లో ‘సేఫ్ వాటర్ రిలీజర్, సేఫ్ మినిమల్ అల్యూమినియం క్రాకర్, సేఫ్ థర్మైట్ క్రాకర్’ రకాలు ఉన్నాయి. సేఫ్ వాటర్ రిలీజర్ క్రాకర్స్‌ను కాల్చినప్పుడు అందులో నుంచి నీరు విడుదలై గాలి, దూళి కణాలు వాతావరణంలో కలువకుండా అడ్డుకుంటుంది. సేఫ్ అల్యూమినియం క్రాకర్లో అల్యూమినియం అతి తక్కువగా ఉంటుంది. సేఫ్ థర్మైట్ క్రాకర్లో వేడిని ఉత్పత్తి చేసే ఐరన్ ఆక్సైడ్ లాంటి ఖనిజ లోహాలను, తక్కువ స్థాయిలో అల్యూమినియంను ఉపయోగిస్తారు. ఇవన్నీ కూడా సాధారణ క్రాకర్స్ కన్నా 70 శాతం తక్కువ, అంటే 30 శాతం కాలుష్యాన్ని మాత్రమే విడుదల చేస్తాయి.