TheIndiaMedia website is for sale. Those who are interested to purchase can reach out to us at theindiamedia2020@gmail.com
Home » News » ‘శ్రీ గోపీ పవిత్ర భోజనాలయం’లోనికి వెళ్ళాలంటే జోడీ ఉండాల్సిందే!..

‘శ్రీ గోపీ పవిత్ర భోజనాలయం’లోనికి వెళ్ళాలంటే జోడీ ఉండాల్సిందే!..

by Murthy

 జైపూర్‌లోని ఓ రెస్టరంట్‌ కూడా ఒంటరి పురుషులను అనుమతించడానికి నిరాకరిస్తోంది. తమ హోటల్లోని అద్భుతమైన రుచులను ఆస్వాదించాలంటే కచ్చితంగా జోడీతోనే రావాలని షరతు విధించింది. ఒకవేళ ఎవరూ లేదంటే మొహమాటం లేకుండా గేటు బయట నుంచే గెట్​ అవుట్​ అనేస్తాడు సెక్యూరిటీ గార్డ్​. ఈ రెస్టారెంట్​ రూల్స్​ అలాంటివి మరి. టైంతో పాటు ట్రెండ్స్​ కూడా మారుతున్నాయి. ప్రజెంట్​ ట్రెండ్స్​​కి తగ్గట్టే కస్టమర్స్​ని అట్రాక్ట్​ చేయడానికి డిఫరెంట్​గా ఆలోచిస్తున్నాయి రెస్టారెంట్​లు, హోటల్స్​. అలా ఈ మధ్య  జైపూర్​లోని ఓ రెస్టారెంట్ కూడా కొంచెం వెరైటీగా ఆలోచించింది. ‘మా రెస్టారెంట్​లో మగవాళ్లు తినాలంటే ఆడవాళ్లని వెంటబెట్టుకుని రావాల్సిందే’ అనే రూల్​ పెట్టింది.

ఇదే విషయాన్ని రెస్టారెంట్​ గోడలతో పాటు ఏసీపైనా రాసి మరీ చెబుతోంది. దాన్ని ఫొటో తీసి హర్షిత శర్మ అనే మహిళ సోషల్​ మీడియాలో పోస్ట్​ చేసింది. ‘నా​ ఫ్రెండ్​ నన్ను ఎందుకు ఈ రెస్టారెంట్​కి తీసుకెళ్లాడో అర్థమయ్యింద’ని ఆ ఫొటో కింద ఫన్నీ క్యాప్షన్​ పెట్టింది. అంతే… కొద్ది నిమిషాల్లోనే ఈ ట్వీట్​ తెగ వైరల్​ అయింది. వేలల్లో లైక్స్​ కూడా వచ్చాయి. చాలామంది దీన్ని రీ ట్వీట్​ చేస్తున్నారు. పోటీలు పడి మరీ ఫన్నీ కామెంట్లు పెడుతున్నారు. ఒకరైతే ఏకంగా ఈ రెస్టారెంట్ వెతికి పట్టుకుని దీని పేరు ‘గోపీ భోజనాలయం’ అని ట్విట్టర్​లో దండోరా వేశారు. ఇంకొందరు తమ ఏరియాలో ఉన్న ఇలాంటి స్పెషల్​ రెస్టారెంట్​ల గురించి సోషల్​ మీడియాలో పోస్ట్​ చేస్తున్నారు. ఏదేమైనా ఈ రెస్టారెంట్​కి మాత్రం ఫ్రీగా ఫుల్​ పబ్లిసిటీ దొరికింది. కానీ, లేడీస్​ ఉంటేనే ఎంట్రీ ఏంటన్న విషయం మాత్రం ఎవరికీ అర్థం కావట్లేదు. రెస్టారెంట్​ వాళ్లు కూడా ఏం చెప్పలేదు.

ఇలాంటి కండిషన్లు పెడితే నాలాంటి సింగిల్స్‌ ఆకలితో చచ్చిపోవాల్సిందేనా?’ అని మరికొంతమంది కామెంట్‌ చేశారు. నెటిజన్లు భిన్నాభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు. ‘రెస్టరంట్‌ విధించిన షరతు ఆసక్తిగా ఉంది. రౌడీ మూకలు, తాగుబోతులు, ఆకతాయిల నుంచి మహిళల్ని కాపాడేందుకు ఈ నిర్ణయం సహకరిస్తుంది’ అని కొందరు నెటిజన్లు స్పందించారు. ‘

https://twitter.com/Harshita511?ref_src=twsrc%5Etfw%7Ctwcamp%5Etweetembed%7Ctwterm%5E1449651813234327553%7Ctwgr%5E%7Ctwcon%5Es2_&ref_url=https%3A%2F%2Ftv9telugu.com%2Ftrending%2Fthis-jaipur-restaurant-allows-men-only-when-they-are-accompanied-by-women-find-the-reason-why-560852.html

Related Articles

Leave a Comment

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More