టీడీపీ మాజీ మంత్రి..పరిటాల సునీత చేసిన వ్యాఖ్యల పైన టీడీపీ రెబల్ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ సీరియస్ గా రియాక్ట్ అయ్యారు. తాను పరిటాల సునీతను వదినగానే చూస్తానని చెప్పారు. వంశీకి అప్పట్లోనే పరిటాల రవితో సన్నిహిత సంబంధాలు ఉండేవి. అయితే, ఇప్పుడు చంద్రబాబు దీక్ష వేదిక నుంచి సునీత కీలక వ్యాఖ్యలు చేసారు. చంద్రబాబు ముఖ్యమంత్రి అయ్యాక గంట కళ్లు మూసుకుంటే తామేంటో చూపిస్తామన్నారామె. తమలో ప్రవహించేది సీమ రక్తమేనని.. తన భర్తను చంపినప్పడు కూడా ఓర్పుగా ఉండమన్నారు కాబట్టే ఉన్నామని చంద్రబాబు మారాలిని ఆమె సూచించారు. మంత్రులు ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతున్నారని.. వల్లభనేని వంశీ, కొడాలి నానిలు ఓడిపోవడం ఖాయమన్నారు సునీత. వైసీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత రెండున్నరేళ్లుగా టీడీపీ కేడర్ ఇబ్బందిపడుతుందన్నారని.. ఇక ఓపిక పట్టలేమన్నారు.
ఈ వ్యాఖ్యలకు వల్లభనేని వంశీ స్పందించడమేకాదు, ఏకంగా ఓపెన్ ఛాలెంజ్ కూడా విసిరేశారు. ఈ వ్యాఖ్యల మీద స్పందించిన వల్లభనేని వంశీ కౌంటర్ ఇచ్చారు. వదిన సునీత మంత్రిగా ఉన్న సమయంలోనే…గుడివాడ నుంచి కొడాలి నాని గెలుపొందారని గుర్తు చేసారు. వదిన సునీత కృష్ణ సారధ్యం చేస్తారో లేదో అక్కడ లోకేశ్ ను బరిలోకి దింపుతారో..ఇంకా ఎవరినైనా దింపుతారో నిర్ణయించి..గెలిపించుకోవాలని ఛాలెంజ్ చేసారు. తాను గన్నవరానికి..కొడాలి నాని గుడివాడకు తొలి ఎమ్మెల్యే కాదని..తామే చివరి ఎమ్మెల్యేలం కాదని వ్యాఖ్యానించారు. వీళ్ళిద్దరి వాఖ్యలతో మళ్ళీ ఏపీ రాజకీయాలు హీటెక్కాయి అనే చెప్పొచ్చు.