ఎప్పటికప్పుడు తన కస్టమర్లను ఆఫర్స్ తో ఆకట్టుకునే ఈకామర్స్ దిగ్గజం ఫ్లిప్కార్ట్ షాపింగ్ సైట్ ఇప్పుడు మరెన్నో అద్భుతమైన ఆఫర్స్ తో అమెజాన్ సహా అన్ని ఈ కామర్స్ షాపింగ్ సైట్స్ కి గట్టి పోటీ ఇస్తుంది. మంగళవారం నుండి ‘ఫ్లిప్ స్టార్ట్ డేస్’ సేల్ మొదలుపెట్టింది ఫ్లిప్కార్ట్ ఈ సేల్ సెప్టెంబర్ 1 నుంచి సెప్టెంబర్ 3 వరకు కొనసాగుతుంది.
మూడు రోజుల ఈ సేల్ లో బ్యాంక్ ఆఫ్ బరోడా మరియు ఫెడరల్ బ్యాంకు క్రెడిట్ మరియు డెబిట్ కార్డు వినియోగదారులకు 10 శాతం అదనపు ఇన్స్టంట్ డిస్కౌంట్ ఇస్తుంది.
లొక్డౌన్ కారణంగా ఎన్నో నెలలు సేల్స్ లేకపోవడం వల్ల భారీ నష్టాలు ఎదుర్కున్న ఫ్లిప్ కార్ట్, ఇప్పుడు ‘ఫ్లిప్ స్టార్ట్ డేస్’ సేల్ తో ఒక్కసారిగా యూజర్స్ ని తమ ఆఫర్స్ తో ఆకట్టుకొంటుంది. ఎన్నో రోజులుగా తమకు నచ్చిన వస్తువులు కొనాలని ప్లాన్ చేసుకొని లొక్డౌన్ ఇబ్బందుల వల్ల ఆగిపోయిన వారికి ఈ సేల్ బంపర్ ఆఫర్ అనే చెప్పొచ్చు.
‘ఫ్లిప్ స్టార్ట్ డేస్’ సేల్ లో భాగంగా ఎలక్ట్రానిక్స్ మరియు గాడ్జెట్స్ వంటి వస్తువుల పై భారీగా 80 శాతం వరకు డిస్కౌంట్ లు అందిస్తుంది ఫ్లిప్కార్ట్.
ఇప్పుడు కరోనా వైరస్ లొక్డౌన్ కారణంగా పిల్లలు పెద్దలు అందరు తమ తమ ఇళ్లకే పరిమితం అయ్యారు. పిల్లలు ఆన్లైన్ క్లాసులు ఇంట్లో నుండి అటెండ్ అవుతుండగా, పెద్దలు వర్క్ ఫ్రొం హోమ్ తో బిజీ బిజీగా ఉంటున్నారు,. ఇప్పుడు లాప్ టాప్స్ , కంప్యూటర్లకు ఉన్న డిమాండ్ ని చక్కగా క్యాష్ చేసుకునే ప్రయత్నంలో భాగంగా ఫ్లిప్కార్ట్ బ్రాండ్ న్యూ లాప్ టాప్స్ పై 30 శాతం వరకు డిస్కౌంట్ ప్రకటించింది.
హెడ్ఫోన్లు హోమ్ థియేటర్స్ వంటి వస్తువులపై ఫ్లిప్కార్ట్ 70 శాతం వరకు డిస్కౌంట్ అందిస్తుంది.
అలాగే ఎవ్వరైతే కొత్త స్మార్ట్ టీవీని కొనుగోలుచేసి హోమ్ థియేటర్ను కొనడానికి మంచి ఆఫర్స్ కోసం ఎదురుచూస్తున్నారో వారికి ఫ్లిప్కార్ట్ ఇప్పడు ప్రీమియం బ్రాండ్ హోమ్ థియేటర్ పై 60 శాతం వరకు డిస్కౌంట్ అందిస్తుంది.
ఫోటోగ్రఫీ లవర్స్ కి కెమెరా మరియు దానికి సంబంధించిన వస్తువులు కొనుగోలు చేయడానికి ఫ్లిప్కార్ట్ ఒక గ్రేట్ ఆఫర్ ఇస్తుంది అదేంటంటే నార్మల్ రోజుల్లో ఎక్కువ ధరకు ఖరీదు చేసే కెమెరా కు సంబంధించిన వస్తువులను ఇప్పుడు కేవలం 999 రూపాయల నుండి అందిస్తుంది. అలాగే DSLR లేదా మిర్రర్ లెస్ కెమెరా కొనాలన్నా ఇదే మంచి అవకాశం.
కొత్త టీవీను కొనాలనుకునే వారికి టాప్ బ్రాండ్ నుండి స్మార్ట్ టీవీలను ఫ్లిప్కార్ట్ కేవలం 9,000 నుండి అందిస్తుంది.