ఫైజాబాద్ రైల్వే స్టేషన్‌కు పురాతనమైన చరిత్ర ఉంది.. దీన్ని అయోధ్య కంటోన్మెంట్‌గా పేరు మార్చడం సరికాదని చరిత్రకారులు అభిప్రాయపడుతున్నారు. చారిత్రక ఫైజాబాద్ నగరం గుర్తింపును కోల్పోయే ప్రమాదముందని అభిప్రాయపడ్డారు. అయితే ఈ పేరు మార్పు గందరగోళానికి గురిచేసే అవకాశముందని అభిప్రాయపడుతున్నారు. ఈ రైల్వే స్టేషన్‌ను ఇక అధికారికంగా అయోధ్య కంటోన్మెంట్ గా పరిగణిస్తున్నారు. ఆ మేరకు రైల్వే స్టేషన్ ప్లాట్‌ఫాం మీదున్న పాత నేమ్ బోర్డులను అయోధ్య కంటోన్మెంట్‌గా మార్చారు. యూపీలోని యోగి ఆదిత్యనాథ్ సర్కారు గతంలో అలహాబాద్ రైల్వే స్టేషన్ పేరును ప్రయాగ్‌రాజ్‌గా – ముఘల్‌సరయ్ రైల్వే జంక్షన్ పేరును పండిట్ దీల్ దయాల్ ఉపాధ్యాయ్ జంక్షన్‌గా మార్చడం తెలిసిందే.
ఉత్తర్‌ప్రదేశ్‌లో 19వ శతాబ్దం నాటి ఫైజాబాద్ రైల్వేస్టేషన్ పేరును ‘అయోధ్య కంటోన్మెంట్’గా మార్చడంపై చరిత్రకారులు, స్థానికుల నుంచి మిశ్రమ స్పందన వ్యక్తమవుతోంది. 2018లో ఫైజాబాద్ జిల్లాను రాష్ట్ర ప్రభుత్వం అయోధ్య జిల్లాగా పేరు మార్చింది. ప్రస్తుతం అక్కడి రైల్వేస్టేషన్ బోర్డులు కూడా మారిపోతున్నాయి. ఇవన్నీ చారిత్రక నగరానికి ఉన్న గుర్తింపును చెరిపేస్తున్నాయని స్థానికుల్లో ఎక్కువమంది పెదవి విరుస్తున్నారు. పైగా ఇక్కడికి 10 కిలోమీటర్ల దూరంలోనే ‘అయోధ్య’ పేరుతో మరో రైల్వేస్టేషన్ ఉండటంతో ప్రయాణికుల్లో గందరగోళం ఏర్పడుతోందని చెబుతున్నారు. అయోధ్య అన్న పేరుతో ఇది రాముడి నగరమన్న విశేష గుర్తింపు వస్తుందని పేర్కొంటున్నారు. హిందువుల మనోభావాల పేరిట రాజకీయ లబ్ధి పొందాలన్నదే భాజపా ప్రభుత్వ వ్యూహమని ప్రతిపక్షాలు విమర్శిస్తున్నాయి.