కేశినేని ఆఫీసులో చంద్రబాబుతో కలిసున్న ఫొటోను తొలగించి, ఆ స్థానంలో రతన్ టాటాతో నాని కలిసున్న ఫొటోను పెట్టారు. మొదట నుంచి బెజవాడలో రాజకీయాలు హాట్ హాట్‌గానే సాగుతుంటాయి. ముఖ్యంగా తెలుగుదేశం పార్టీలో ఊహించని ట్విస్ట్‌లు నడుస్తున్నాయి. ఇక్కడ గ్రూప్ రాజకీయాల వల్ల పార్టీలో రచ్చ నడుస్తోంది. అసలు ఎంపీ కేశినేని నాని, మాజీ ఎమ్మెల్సీ బుద్దా వెంకన్న వర్గాలకు అసలు పడటం లేదనే సంగతి తెలిసిందే. వీరి వల్ల పార్టీకి చాలా డ్యామేజ్ జరిగింది. అయితే ఈ గ్రూప్ తగదాల నేపథ్యంలో ఎంపీ కేశినేని నాని ఈ మధ్య ఒక సంచలన నిర్ణయం తీసుకున్నారు. వచ్చే ఎన్నికల్లో తాను పోటీ చేయబోనని చెప్పిన విజయ వాడ ఎంపీ కేశినేని నాని మరో సంచలన నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. త్వరలోనే భారతీయ జనతా పార్టీ లో చేరేందుకు మార్గం సుగమం చేసుకున్నట్లు సమాచారం అందుతోంది.
కేశినేని సోషల్ మీడియా ఖాతాల్లో కూడా టిడిపి కనబడట్లేదు. దీని బట్టి చూస్తే కేశినేని టిడిపిని వీడటం ఖాయమే అని తెలుస్తోంది. కేశినేని భవన్ లో తెలుగు దేశం పార్టీ అధినేత చంద్ర బాబు నాయుడు ఫొటోలను తొలగించారు ఆయన సిబ్బంది. కేశినేని భవన్ లో చంద్రబాబు నాయుడు తో పాటు తెలుగు దేశం పార్టీ నేతల ఫ్లెక్సీలను కూడా తొలగించారు నేతలు. గ్రౌండ్ ఫ్లోర్ మరియు ఆఫీసు లోపల ఉన్న పార్టీ నేతల ఫ్లెక్సీలు తొలగించారు. చంద్రబాబు మరియు ఇతర నేతల ఫొటోల స్థానం లో రతన్ టాటా ఫోటోలు పెట్టింది కేశినేని సిబ్బంది.
పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉంటున్నట్లు ఇప్పటికే ప్రకటించిన కేశినేని నాని ఈ నేపథ్యంలోనే చంద్రబాబు ఫోటోలు తీసేయడంపై అందరిలోనూ గందర గోళ పరిస్థితి నెలకొంది. త్వరలోనే బీజేపీ లో ఆయన చేరుతారని సమాచారం అందు తోంది.అయితే నాని మాత్రం అధికారికంగా ఎలాంటి ప్రకటన చేయలేదు. సోషల్ మీడియాతో పాటూ పొలిటికల్ సర్కిల్స్‌లో మాత్రమే ఈ ప్రచారం జరుగుతోంది.