TheIndiaMedia website is for sale. Those who are interested to purchase can reach out to us at theindiamedia2020@gmail.com
Home » News » ఈటల గెలుపు – ఇక అధికారక ప్రకటన లాంఛనమే!..

ఈటల గెలుపు – ఇక అధికారక ప్రకటన లాంఛనమే!..

by Murthy

ఉప ఎన్నికలో బీజేపీ విజయం సాధించింది. టీఆర్ఎస్ అభ్యర్థి గెల్లు శ్రీనివాస్ యాదవ్‌పై బీజేపీ అభ్యర్థి ఈటల రాజేందర్ భారీ మెజార్టీతో గెలుపొందారు. దాదాపు అన్ని రౌండ్లలో ఈటల రాజేందర్ ఆధిక్యం కనబర్చారు. ఈటల రాజేందర్ సొంత మండలంలో బీజేపీ హవా కొనసాగుతోంది. ఈటల రాజేందర్ 2004 నుంచి వరుసగా 7సార్లు ఎమ్మెల్యేగా గెలుపొందారు.  ఈట‌ల రాజేంద‌ర్ త‌న ప్ర‌ధాన ప్ర‌త్య‌ర్థి, టీఆర్ఎస్ అభ్య‌ర్థి గెల్లు శ్రీ‌నివాస్ స్వ‌గ్రామంలో మెజార్టీ సాధించ‌డాన్ని ప్ర‌త్యేక ఆక‌ర్ష‌ణ‌గా నిలిచింది. గెల్లు శ్రీ‌నివాస్ స్వ‌స్థ‌లం వీణ‌వంక మండ‌లం హిమ్మ‌త్‌న‌గ‌ర్. ఈ గ్రామంలో గెల్లు శ్రీ‌నివాస్ కంటే ఈట‌ల రాజేంద‌ర్‌కు 191 ఓట్ల మెజార్టీ ద‌క్క‌డం విశేషం.

హుజూరాబాద్ ఉప ఎన్నిక ఓట్ల లెక్కింపు కొనసాగుతుండగా, ప్రధానంగా బీజేపీ, టీఆర్ఎస్ అభ్యర్థుల మధ్యే పోరు నెలకొంది. కాంగ్రెస్ అభ్యర్థి వెంకట్ బల్మూరి దరిదాపుల్లో ఎక్కడా కనపడలేదు. కనీసం డిపాజిట్ కు కూడా నోచుకోలేదు. ఈటల రాజేందర్ విజయం సాధించడంతో తెలంగాణ వ్యాప్తంగా బీజేపీ నేతలు, కార్యకర్తలు సంబరాలు చేసుకున్నారు. హైదరాబాద్ గన్ పార్క్ వద్ద అమరవీరులకు బీజేపీ నేతలు నివాళులర్పించి స్వీట్స్ పంచుకున్నారు. రాష్ట్ర ప్రభుత్వం ఎన్ని కోట్లు ఖర్చు పెట్టినా ఈటల గెలుపును అడ్డుకోలేకపోయారన్నారు. 2023లో బీజేపీ అధికారంలోకి వస్తుందని ఈ విజయం సంకేతమని బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు మనోహర్ రెడ్డి అన్నారు.

Related Articles

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More