ఇలియానా ఒకప్పుడు కుర్రాళ్ళ కలల రాకుమారి . దేవదాసు సినిమాతో తెలుగుతెరకు పరిచయమైనా దేశముదురు సినిమాతో తెలుగు ప్రేక్షకులకు మరింత దగ్గరైంది. ఈ ముద్దుగుమ్మ కందిరీగ లాంటి నడుము తో ఎంతోమంది కుర్రకారుకు నిద్రలేకుండా చేసింది. ప్రత్యేకించి తన సన్నని నడుమును అల్లు అర్జున్ నటించిన జులాయ్ సినిమాలో ఎంతో అద్భుతంగా చూపించారు. అందం, అభినయంతో తెలుగు ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంది.. ఆ తర్వాత ఇండస్ట్రీ కి దూరమైన విషయం తెలిసిందే. బాలీవుడ్ చెక్కేసింది కానీ అక్కడ అనుకున్నంతగా ఆఫర్లు పలకరించలేదు. ఆతర్వాత లవ్ , బ్రేకప్, డిప్రషన్, బరువు పెరగడం ఇలా చకచకా అన్ని జరిగిపోయాయి.
ఒక్క హిట్టు సినిమా చేతిలో లేకపోయినా కూడా ఇలియానా మాత్రం ఎప్పుడూ ట్రెండింగ్లోనే ఉంటారు. అలాంటి ఇలియానా సోషల్ మీడియాలో బికినీ అందాలను ఎరగా వేస్తుంటారు. ఇలియానాకు బీచ్లు, వెకేషన్స్ అంటే ఎంత ఇష్టమో అందరికీ తెలిసిందే. కరోనా కారణంగా తాను బీచ్ సౌందర్యాలను ఎంతగా మిస్ అవుతున్నారో చెబుతూ చేసిన పోస్ట్లు బాగానే వైరల్ అయ్యాయి. ఇండస్ట్రీ అనేది చాలా క్రూరమైన ప్రదేశం అనే చెప్పాలి. ప్రజాదరణ విషయంలో సినీ పరిశ్రమలో సమతుల్యం ఉండదని సంచలన వ్యాఖ్యలు వ్యాఖ్యలు చేసింది.
ఎవరైనా తొలిసారిగా హీరోయిన్ గా కావాలంటే పడుకోక తప్పదు.. పడక సుఖం అందిస్తేనే అవకాశాలు వస్తాయి అంటూ కొన్ని వాక్యాలు చేస్తూ బాలీవుడ్ లో కూడా క్యాస్టింగ్ కౌచ్ ఎక్కువగా ఉందని చెప్పుకొచ్చింది. తన మీద కూడా ఎన్నో క్యాస్టింగ్ కౌచ్ అనుభవాలు జరిగాయని ఇలియానా తేల్చిచెప్పింది.