క్రొయోషియాలోని లెగ్రాడ్ అనే ప్రాంతం ఉన్నది. అందమైన ప్రకృతి… ఈ లెగ్రాడ్ను ఆనుకొని సుందరమైన సముద్రం, తివాచీలాంటి బీచ్లు ఉంటాయి. క్రొయేషియా దేశంలోని లెగ్రాడ్ అనే పట్టణం గత కొన్నేళ్లుగా ప్రజలు లేక వెలవెలబోతోంది. సౌకర్యాలు అంటూ లెగ్రాడ్ లోని ప్రజలు ఇతర ప్రాంతాలకు వెళ్లిపోయారు. దీంతో గత వందేళ్లుగా జనాభా తగ్గిపోయింది. మళ్ళీ ప్రజలను లెగ్రాడ్ పట్టణంలో నివసించేలా చేయాలనీ ప్రభుతం నిర్ణయించుకుంది. వెళ్లివారితో పాటు.. అందరూ ఈ పట్టణం వైపు దృష్టి పెట్టేలా చేయాలనీ.. మళ్ళీ లెగ్రాడ్ ప్రజలతో నిండిపోవాలని భావించింది.. అందుకే సరికొత్త ప్లాన్ తో ప్రజల ముందుకొచ్చింది. ప్రజలను లెగ్రాడ్ పట్టణంలో నివసించేలా ఆకర్షించేందుకు ఇళ్లను అత్యంత చవకగా విక్రయిస్తోంది. ఇల్లు కొనాలి అనుకుంటే ఒక్క కొనా అంటే రూ.12 చెల్లిస్తే సరిపోతుంది. ఇంటిని అందంగా ముస్తాబు చేసుకోవడానికి 25 వేల కొనాలు ప్రభుత్వం ఇస్తుంది.
అయితే, షరతులు వర్తిస్తాయి. ఈ షరతులు ఒప్పుకొని కేవలం 17 మంది మాత్రమే ఇళ్లను కొనుగోలు చేశారట. కొనుగోలు దారుల వయస్సు 40 ఏళ్లలోపు ఉండాలి మరియు వారు కనీసం 15 సంవత్సరాల పాటు క్రొయేషియా పట్టణం లెగ్రాడ్లో ఉండటానికి కట్టుబడి ఉండవలసి ఉంటుందని నివేదిక పేర్కొంది. లెగ్రాడ్ ఒకప్పుడు క్రొయేషియా భూభాగంలో రెండవ అతిపెద్ద జనాభా కేంద్రంగా ఉండేది, అయితే అది ఒక శతాబ్దం క్రితం ఆస్ట్రో-హంగేరియన్ సామ్రాజ్యం విచ్ఛిన్నానికి గురైంది.