హైదరాబాద్ వేదికగా భోళా శంకర్ మూవీ పూజ ఘనంగా జరిగింది. టాలీవుడ్ టాప్ డైరెక్టర్స్ హాజరు కాగా, అట్టహాసంగా నిర్వ హించారు. సీనియర్ దర్శకులు రాఘవేంద్రరావు, డైరెక్టర్ బాబీ, వివి వినాయక్, హరీష్ శంకర్ ,కొరటాల శివ, గోపీచంద్ మలినేని, హాజరయ్యారు. అలాగే చిత్ర నిర్మాతలుగా ఉన్న అనిల్ సుంకర, కే ఎస్ రామారావు పాల్గొన్నారు. భోళా శంకర్ చిత్రంలో చిరుకు జంటగా నటిస్తోన్న తమన్నా పూజా కార్యక్రమానికి హాజరయ్యారు. దర్శకుడు మెహర్ రమేష్ తెరకెక్కించనున్న భోళా శంకర్ తమిళ్ హిట్ మూవీ వేదాళం కి తెలుగు రీమేక్ అంటూ ప్రచారం సాగుతుంది. అయితే చిత్ర యూనిట్ దీనిపై ఎటువంటి ప్రకటన చేయలేదు. ఈ భారీ ప్రాజెక్ట్ కి థమన్ సంగీతం అందిస్తున్నారు. స్టార్ హీరోయిన్ కీర్తి సురేష్ భోళా శంకర్ చిత్రంలో చిరంజీవి చెల్లిగా నటిస్తున్న విషయం తెలిసిందే.
ఇక ఈ చిత్రాన్ని ఏకే ఎంటర్టైన్మెంట్ మరియు క్రియేటివ్ కమర్షియల్స్ సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ఇదిలా ఉంటే భోళా శంకర్ సినిమా షూటింగ్ శరవేగంగా పూర్తి చేయాలనీ మెగాస్టార్ కండీషన్ పెట్టారట. సినిమా చిత్రీకరణ కు ఎక్కువ సమయం తీసుకోకుండా మొత్తం 40 నుండి 50 వర్కింగ్ డేస్ లోనే ముగించేలా ప్లాన్ చేయాలని మెహర్ రమేష్ తో చెప్పినట్లుగా టాక్ వినిపిస్తుంది. దర్శకుడు కొరటాల దర్శకత్వంలో తెరకెక్కిన ఆచార్య ఫిబ్రవరి 4న గ్రాండ్ గా విడుదల కానుంది. సామాజిక అంశంతో కూడిన యాక్షన్ ఎంటర్టైనర్ గా కొరటాల ఆచార్య చిత్రాన్ని తెరకెక్కించారు. మొదటిసారి చిరు, చరణ్ కలిసి ఓ పూర్తి స్థాయి మల్టీస్టారర్ చేస్తున్నారు. కాజల్ అగర్వాల్, పూజా హెగ్డే హీరోయిన్స్ గా నటిస్తున్నారు.