తమిళనాడు రాజధాని చెన్నై నగరం అతలాకుతమవుతోంది. కుండపోత వర్షాలతో తమిళనాడు రాజధాని చెన్నై నగరం అతలాకుతమవుతోంది. బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనంతో పాటు ఈశాన్య రుతువవనాలు నిర్ణీత సమయానికి ముందే రాష్ట్రంలోకి ప్రవేశించడంతో చెన్నై నగరం భారీ వర్షాలతో నీట మునిగింది. గత మూడు రోజులుగా ఎడతెరిపిలేకుండా కురుస్తున్న వర్షానికి నగరంలోని చాలా ప్రాంతాలు ముంపునకు గురయ్యాయి. వేలాదిమంది నగర వాసులు వరదల్లో చిక్కుకున్నారు. అల్పపీడనంతోపాటు ఈశాన్య రుతువవనాలు నిర్ణీత సమయానికి ముందే రాష్ట్రంలోకి ప్రవేశించడంతో చెన్నై నగరం భారీ వర్షాలతో నీట మునిగింది. గత మూడు రోజులుగా ఎడతెరిపిలేకుండా కురుస్తున్న వర్షానికి నగరంలోని చాలా ప్రాంతాలు ముంపునకు గురయ్యాయి. వేలాదిమంది నగర వాసులు వరదల్లో చిక్కుకున్నారు. కడలూరు జిల్లాలో వరద విధ్వంసం సృష్టిస్తోంది. శ్రీ ముష్ణం శ్రీ నేదుంచేరి-పావలంగుడి గ్రామాలకు వెళ్లే వంతెనపై నుంచి వరద పోటెత్తుతోంది. దీంతో వాహనాల రాకపోకలు నిలిచిపోవడంతో ప్రమాదకర పరిస్థితుల్లో వంతెన దాటుతున్నారు.
19 జిల్లాల్లో స్కూళ్లు, కాలేజీలకు సెలవులు ప్రకటించారు. 15 డివిజన్లలోని ప్రజలు వంట చేసుకోవడానికి అవకాశం లేకపోవడంతో తమిళనాడు ప్రభుత్వం ఆహారం సరఫరా చేస్తోంది. 15 డివిజన్లలోని ప్రజలకు మూడు పూటల ఆహారం అందించడానికి 15 మంది ఐఏఏస్ అధికారులను నియమించారంటే పరిస్థితి ఎంత దారుణంగా ఉందో అర్థం చేసుకోవచ్చు. తమిళనాడు ముఖ్యమంత్రి ఎంకే. స్టాలిన్ గంట గంటలకు చెన్నై సిటీతో పాటు తమిళనాడులో భారీ వర్షాల కారణంగా ఏం జరుగుతుందో అని ఎప్పటికప్పుడు ఆరా తీస్తున్నారు.