TheIndiaMedia website is for sale. Those who are interested to purchase can reach out to us at theindiamedia2020@gmail.com
Home » News » పబ్జీకి పోటీగా ఫౌ-జీ గేమ్! | Bollywood Actor Akshay Kumar Announces Indian FAU-G As Replacement To PUBG

పబ్జీకి పోటీగా ఫౌ-జీ గేమ్! | Bollywood Actor Akshay Kumar Announces Indian FAU-G As Replacement To PUBG

by Bellamkonda

మోడీ ప్రభుత్వం పబ్జీ తో సహా 118 చైనా యాప్‌లను బాన్ చేసిన తర్వాత కేవలం రెండు రోజులోనే దానికి ప్రత్యామ్నాయంగా ఇండియన్ మల్టీ ప్లేయర్ గేమ్ “ఫౌ-జీ” (ఫియర్లెస్ యునైటెడ్ గార్డ్స్) ని త్వరలోనే మన ముందు తీసుకువస్తున్నటు బాలీవుడ్ ప్రముఖ హీరో అక్షయ్ కుమార్ తన ట్వీట్ ద్వారా ప్రకటించారు.

ఈ ప్రకటన చేసిన కొద్దీ గంటల్లోనే సోషల్ మీడియా లో ఈ న్యూస్ వైరల్ అయ్యింది, పబ్జీని బ్యాన్ తో అయోమయం లో పడ్డ 70 కోట్ల మంది పబ్జీ ప్లేయర్స్ ఈ న్యూస్ విన్నతర్వాత ఆనందం లో మునిగిపోయారు. ఈ గేమ్ కోసం వెయిట్ చేస్తూన్నాం అంటూ పబ్జీ గేమ్ ప్లేయర్స్ అక్షయ్ కుమార్ ట్వీట్ కీ రిప్లై ఇచ్చారు.

pubg banned

ప్రధాని నరేంద్ర మోడీ పిలుపునిచ్చిన “ఆత్మనిర్భర్ భారత్” ఉద్యమంలో లో భాగంగా ఈ ఇండియన్ గేమ్ ని త్వరలోనే లాంచ్ చేస్తాం అని అక్షయ్ కుమార్ ప్రకటించారు. ఫౌ-జీ గేమ్ పోస్టర్ ను ఆయన ట్విటర్ అకౌంట్ లో పోస్ట్ చేశారు.

ఈ పోస్ట్ లో ఫౌ-జీ గేమ్ తో ప్లేయర్స్ కి కేవలం వినోదాన్ని మాత్రమే కాకుండా మన సైనికుల త్యాగాల గురించి కూడా తెలిసేలా ఈ గేమ్ ఉంటుంది అని అక్షయ్ కుమార్ అన్నారు.

ఈ గేమ్ ద్వారా తాము సంపాదించే డబ్బునుండి 20 శాతం నిధులను “భారత్ కే వీర్” అంటే ఇండియన్ ఆర్మీకు తమ “ఫౌ-జీ” ట్రస్ట్ ద్వారా అందిస్తామని అక్షయ్ కుమార్ ప్రకటించారు.

ఫౌజీ పేరుతో రాబోతున్న ఈ ఇండియన్ యాప్ ను బెంగళూరుకు చెందిన ఎన్‌కోర్ గేమ్స్ రూపొందించనుంది . అక్షయ్ కుమార్ తోపాటు, పారిశ్రామికవేత్త, జీవోక్యూఐఐ ఫౌండర్, సీఈవో విశాల్‌ గోండల్‌ కూడా ఏఈ గేమ్ పై ట్వీట్ చేశారు. కానీ ఈ యాప్ అధికారికంగా ఎపుడు అందుబాటులోకి వచ్చేదీ మాత్రం చెప్పలేదు.

Related Articles

Leave a Comment

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More