వికెండ్ షోలో కింగ్ నాగ్ బిగ్ బాస్ సభ్యులని నిలదీసాడు. ఈ క్రమంలో లోబో కు చుక్కలు చూపించాడు. రవి ఏం చెబితే అది చేస్తావా? నీ గేమ్ నువ్ ఆడుకో .. అని గతంలోనూ నాగ్ చెప్పాడు . కానీ.. లోబో తీరులో ఎలాంటి మార్పు రాలేదు. చివరకు రవి చెప్పాడని.. హౌస్ ప్రాపర్టీ డ్యామేజ్ చేశాడు. దీంతో నిన్నటి ఎపిసోడ్ లో లోబోకు ఓ రేంజ్ లో జలక్ ఇచ్చాడు నాగార్జున. చేతిలో టెడ్డీ పెట్టి చెమటలు పట్టించా డు . తనదైన మాస్ స్టైల్ లో క్లాస్ తీసుకున్న తరువాత.. ఎవ్వరూ ఊహించని విధంగా ఒక్కొ కంటెస్టెంట్ ను సిక్రెట్ రూంకు పిలిచి ఇంట్లో ఉండడానికి అర్హత లేని వారు ఎవరో చెప్పాలని అడిగాడు బిగ్ బాస్. దీంతో ఒక్కరి నిజ స్వరూపం బయటపడింది. ఎవరు ఎవరిని ద్వేషిస్తున్నారనే తెలిసి పోయింది.
ప్రియకు, లోబోకు ఎక్కువగా ఓట్లు పడ్డాయి. దీంతో ఇంట్లో ఉండటానికి ఎవరు మద్దతు ఇస్తారు అని అడగ్గా.. ఎక్కువగా ప్రియకు సపోర్ట్ ఇచ్చారు హౌస్ మేట్స్. తక్కువ ఓట్లు లోబోకు వచ్చాయి. దీంతో అనూష్యంగా లోబోను ఎలిమినేట్ అయినట్లుగా ప్రకటించా డు నాగార్జున. ఇంటికి వెళ్తున్న లోబోను పిలిచి.. లక్కీ ఛాన్స్ ఇచ్చాడు . బిగ్ బాస్ హౌస్ నుంచి ఎలిమినేట్ చేసే అధికారం ఎవరికీ లేదని.. కేవలం ఆడియన్స్ కు మాత్రమే ఉందని.. వారు నిన్ను కావాలి అనుకుంటున్నారని చెప్పుకొచ్చాడు.
లోబో కన్నీటిని ఆపుకోలేకపోయాడు. దీంతో స్జేజ్ పై కుప్పకూలిపోయి బోరు బోరున ఏడ్చాడు. మెజారిటీ కంటెస్టెంట్లు నువ్వు వెళ్లాలని ఓటేసినందున వచ్చేవారం నేరుగా నామినేషన్స్‌లో ఉండబోతున్నావని చెప్పాడు. కాకపోతే నువ్వు హౌస్‌లోకి కాకుండా సీక్రెట్ రూమ్‌లోకి వెళ్తున్నావని వెల్లడించాడు. అక్కడే ఉండి అందరిని అబ్జర్వ్ చేయి అని చెప్పాడు.
దీంతో ముందుగా అనుకున్నట్లుగానే లోబోను ఎలిమినేట్ చేసినట్టే చేసి సిక్రేట్ రూంకు పంపించాడు. ఈవారం నామినేషన్స్ నుంచి లోబో గట్టెక్కాడు.. మిగిలిన తొమ్మిది మందిలో ఒకరు ఎలిమినేట్ కాబోతున్నారు.