ఆడబిడ్డలు పువ్వులన పూజించే తెలంగాణలోనే వుందని., తెలంగాణ ఆడబిడ్డల ఆత్మ గౌరవం ఈ బతుకమ్మ పండగ అని ఒక ప్రకటనలోపంచాయితీరాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు పేర్కొన్నారు. కల్వకుంట్ల కవిత ద్వారానే బతుకమ్మ పండగకు ప్రపంచ ఖ్యాతి లభించిందని తెలిపారు. సద్దుల బతుకమ్మ, దసరా పండుగ సందర్భంగా వారికి శుభాకాంక్షలు తెలిపారు. రంగు రంగుల పూలతో త్రికోణాకారంలో పేర్చి అలంకరించిన బతుకమ్మల చుట్టూ చప్పట్లు చరుస్తూ వలయంగా తిరుగుతూ పాడే బతుకమ్మ పాటలు పాడతారు. బొడ్డెమ్మతో మొదలు ఎంగిలిపుప్వు బతుకమ్మ, సద్దుల బతుకమ్మ..
ఇలా దేని ప్రత్యేకత దానిదే.. తొమ్మిది రోజుల పాటు కొనసాగే బతుకమ్మలను బావిలో లేదా నీటి ప్రవాహంలో నిమజ్జనం చేస్తారు.. బతుకమ్మ బతుకమ్మ ఉయ్యాలో అని సాగే ఈ పాటల్లో మహిళలు తమ కష్ట సుఖాలు, ప్రేమ, స్నేహం, బంధుత్వం, ఆప్యాయతలు, భక్తి, భయం, చరిత్ర, పురాణాలు మేళవిస్తారు.. ఈ పాటలు చాలా వినసొంపుగా ఉంటాయి.. తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలకు ప్రతీక ఈ బతుకమ్మ పండుగ.. తెలంగాణ అస్తిత్వం బతుకమ్మలోనే ఉంది. తెలంగాణ నేలపై బతుకమ్మ పండుగను శతాబ్దాలుగా జరుపుకుంటున్నారు.
తెలంగాణ ఉద్యమానికి బతుకమ్మ పండగా స్ఫూర్తి గా నిలిచిందని దయాకర్ రావు పేర్కొన్నారు. సీఎం కెసీఆర్ బతుకమ్మ పండుగను రాష్ట్ర పండుగగా నిర్వహిస్తున్నారని చెప్పారు.సీఎం కేసీఅర్ ఆడ బిడ్డలకు పండుగ కానుక గా బతుకమ్మ చీరలు ఇచ్చారని అన్నారు. ఆడ బిడ్డలను,అల్లుండ్లను ఇంటికి పిలిచి కానుకలు ఇవ్వడం ఈ పండుగ ఆచార సంప్రదాయం. బంధుమిత్రులతో ఆనందంగా జరుపుకునే పండుగలు సద్దుల బతుకమ్మ,దసరా పండుగలని పేర్కొన్నారు.ప్రతి ఒక్కరూ కరోనా నిబంధనలు పాటిస్తూ బతుకమ్మ వేడుకలు జరుపుకోవాలని సూచించారు.