పునీత్ రాజ్ కుమార్ మృతి విషయం తెలీయగానే నందమూరి బాలకృష్ణ ఎమోషనల్ ట్వీట్ చేశాడు. పునీత్ రాజ్ కుమార్ తో దిగిన ఫోటోను బాలయ్య షేర్ చేశాడు. “మన బాలయ్య అంటే ఎంతగానో అభిమానించే కన్నడ పవర్ స్టార్ హీరో పునీత్ రాజ్ కుమార్ గారు గుండెపోటు తో మరణించారు. ఆయన పవిత్ర ఆత్మకు శాంతి కలగాలని కోరుకుందాం. ” అంటూ ట్వీట్ చేశారు బాలయ్య.
అటు బాలయ్య ఫాన్స్ కూడా.. హీరో పునీత్ రాజ్ కుమార్ మృతి పట్ల సంతాపం వ్యక్తం చేస్తున్నారు. ఈ నేపథ్యంలోనే బాలయ్య మరియు హీరో పునీత్ రాజ్ కుమార్.. ఈ వీడియోను షేర్ చేశారు బాలయ్య ఫ్యాన్స్. బాలయ్య మరియు పునీత్ ఓ కార్యక్రమంలో పాల్గొన్న వీడియోను షేర్ చేశారు. అయితే ఈ వీడియోలో.. బాలయ్య, పునీత్ ల మధ్య పో ఎమోషనల్ సన్నివేశం మనకు కనిపిస్తుంది. బాలయ్య ఫేక్ కు.. ఏదో మరక అంటింతే… దానిని స్వయంగా పునీత్ తూడవటం మనం గమనించవచ్చు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. సినీ ప్రముఖులు సంతాపం వ్యక్తం చేస్తున్నారు.