TheIndiaMedia website is for sale. Those who are interested to purchase can reach out to us at theindiamedia2020@gmail.com
Home » News » అతడు – అతడూ పెళ్ళి చేసుకుంటున్నారు!..

అతడు – అతడూ పెళ్ళి చేసుకుంటున్నారు!..

by Murthy

తెలంగాణలో మొట్టమొదటి ‘గే’ వివాహం. అతడంటే.. అతడికి ఇష్టం. అతడికి కూడా అంతే. ఆ ఇద్దరు యువకులు ఒకరినొకరు ఇష్టపడి.. ఎనిమిదేళ్లుగా కలిసి జీవిస్తున్నారు. వారి మధ్య ఉన్న బంధాన్ని పెళ్లితో సుసంపన్నం చేసుకోవాలని నిర్ణయించు కున్నారు. ఈ స్వలింగ సంపర్కుల వివాహం తెలంగాణాలో జరగనుంది. తెలంగాణాలో ఇదే మొట్టమొదటి గే వివాహం.  పశ్చిమ బెంగాల్‌కు చెందిన సుప్రియో, ఓ హోటల్‌ మేనేజ్‌మెంట్‌ కళాశాలలో లెక్చరర్‌గా పనిచేస్తున్నారు. పంజాబ్‌కు చెందిన అభయ్‌ ఓ సాఫ్ట్‌వేర్‌ డెవల్‌పమెంట్‌ ఇండస్ట్రీలో పనిచేస్తున్నారు. ఓ డేటింగ్‌ యాప్‌లో ఎనిమిదేళ్ల క్రితం ఇద్దరికి పరిచయం అయింది. ఒక గంట పాటు చాటింగ్‌తోనే ఇద్దరూ ఒకరకంటే ఒకరు ఇష్టపడ్డారు. అప్పటి నుంచి సహజీవనం చేస్తున్నారు.

నేను బెంగాలీ.. తాను పంజాబీ. రెగ్యూలర్ మ్యారేజెస్ లాగే అన్ని కార్యక్రమాలతో పెళ్లి జరుగుతుంది. హల్దీ ఫంక్షన్ నుంచి, బ్రంచ్ పార్టీ, రింగులు మార్చుకోవడం వంటివి అన్నీ జరుగుతాయి. మా పేరెంట్స్ షాపింగ్ మొదలుపెట్టేశారు. వెడ్డింగ్ గురించి చాలా ఎగ్జైటింగ్ గా ఉంది’ అని సుప్రియో అంటున్నారు. తమ తల్లిదండ్రులు సనాతన భారతీయ ధర్మాలను విశ్వసిస్తారని, పెళ్లికి సమయం తీసుకొని వారు అర్థం చేసుకునేలా చేశామని సుప్రియో చెప్పారు.

‘నాకు స్కూల్ లో అవమానం జరిగేది. కొన్ని రాత్రులు నిద్రలేకుండా గడిపాను కూడా. ఆ తర్వాత ఒక్కొక్కరు అర్థం చేసుకోవడం మొదలైంది. అందరిలాగే మేం కూడా పార్టనర్స్ ను ఎంచుకునే హక్కు ఉంది. ఇతర రాష్ట్రాల్లో చాలా మంది గే కపుల్స్ పెళ్లి చేసుకున్నారు కానీ, తెలంగాణలో తొలిసారి ఇటువంటి వివాహం జరుగుందని అభయ్ వెల్లడించాడు.

Related Articles

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More