TheIndiaMedia website is for sale. Those who are interested to purchase can reach out to us at theindiamedia2020@gmail.com
Home » News » ఒక ఓవర్లో ఎనిమిది సిక్సర్లు… అదెలా సాధ్యం!?.

ఒక ఓవర్లో ఎనిమిది సిక్సర్లు… అదెలా సాధ్యం!?.

by Murthy
క్రికెట్ ఆటలో ఏదైనా జరగవచ్చని తరచుగా చెబుతుంటారు. క్రికెట్  అభిమానులందరూ ప్రస్తుతం జరుగుతున్న టీ 20 ప్రపంచకప్‌కి అతుక్కుపోయినప్పుడు, ఆస్ట్రేలియాలో కూడా యాక్షన్ ప్యాక్డ్ డే కనిపించింది.  ఒకే ఓవర్‌లో బ్యాటర్ ఎన్ని పరుగులు చేయగలడు? దీనికి నిర్దేశించబడిన ఎగువ పరిమితి లేనప్పటికీ, గ్రేడ్ క్రికెట్‌లో ఆస్ట్రేలియన్ బ్యాటర్ ఆశ్చర్యకరమైనది చేశాడు. సీనియర్ క్లబ్‌కి ప్రాతినిధ్యం వహిస్తున్న సామ్ హారిసన్, ఒకే ఓవర్‌లో 8 సిక్సర్లు కొట్టాడు, నాథన్ బెన్నెట్ ఒక ఓవర్‌లో 50 పరుగులు సాధించాడు.

ఆస్ట్రేలియాలో లో జరిగిన ఓ క్లబ్ క్రికెట్ మ్యాచ్ లో ప్రపంచంలో ఇప్పటి వరకు జరగని… ఓ అరుదైన సంఘటన చోటు చేసుకుంది. ఇప్పటి వరకు మనం ఒక ఓవర్లో ఆరు సార్లు కొట్టడం చూశాం… ఆరు సిక్సర్లు కొట్టడం కూడా మన క్రికెట్ ఆటగాళ్లకు పెద్ద సవాల్. అంతే కాదు ఆరు సార్లు కొడితే ఓ రికార్డ్ క్రియేట్ చేయడం మాత్రం ఖాయం. అయితే తాజాగా పెర్త్ లో జరిగిన క్లబ్ క్రికెట్ మ్యాచ్ లో ఆస్ట్రేలియా దేశవాళి క్రికెటర్… ఒకే ఓవర్లో ఏకంగా 8 సిక్సర్లు బాదేశాడు.

ఓవర్లో రెండు నో బాల్స్ కూడా పడ్డాయి. దీంతో అతడు మొత్తం 8 బాల్స్ వేయాల్సి వచ్చింది. ఈ ఎనిమిది బంతులకు ఎనిమిది సిక్సర్లు అంటే 48 పరుగులు సాధించాడు హరిసన్. ఇక ఈ మ్యాచ్ లో హారిసన్ ఏకంగా 11 సిక్సర్లు, ఆరు ఫోర్లతో 102 పరుగులు చేశాడు.  ఈ సంఘటన ఆట 39 వ ఓవర్‌లో జరిగింది.  ఇక 8 సిక్సర్లు కొట్టడం పై పలువురు క్రికెటర్లు అతడిపై ప్రశంసలు కురిపిస్తున్నారు. 

Related Articles

Leave a Comment

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More