బాలీవుడ్ బాద్ షా షారూఖ్ నివాసమైన మన్నత్‌తో పాటు అనన్య పాండే ఇళ్లపై నార్కొటిక్స్ కంట్రోల్ బ్యూరో (ఎన్సీబీ) అధికారులు అక్టోబర్ 21న దాడులు జరిపారు. అనన్య పాండేతో ఆర్యన్ ఖాన్ డ్రగ్స్ గురించి చర్చించినట్టు వారు ప్రత్యేక కోర్టుకు గతంలోనే సాక్ష్యాలను సమర్పించారు. గురువారం రెండు గంటల సమయంలో వారి ఇద్దరి ఇళ్లపై ఒకేసారి దాడులు జరిపారు. మన్నత్పై దాడులు జరపగానే హన్సల్ మెహతా ట్విటర్లో షారూఖ్‌కు తన మద్దతును తెలిపారు. ‘‘ స్టార్, సెలెబ్రిటీ, బాలీవుడ్‌కు చెందినంత మాత్రాన మీకు బావోద్వేగాలు ఉండబోవని అనుకోవడం సరికాదు. ఒక తండ్రిగా మీరు పడే బాధ ప్రజలకు తెలియదు. బెయిల్‌ను ఇవ్వకపోవడం అనేది ఘోరమైన తీర్పు ’’ అని సోషల్ మీడియాలో ఆయన పోస్ట్ చేశారు. ‘‘ స్కామ్ 1992: హర్షద్ మెహతా స్టోరీ ’’ వెబ్ సిరీస్‌కు హన్సల్ మెహతా దర్శకత్వం వహించిన సంగతి తెలిసిందే.
బాలీవుడ్ యాక్టర్ చుంకీ పాండే కుమార్తె అనన్యా పాండే తన ఇంట్లో నుంచి ఓ బ్యాగులు పట్టుకొని బయటకు వెళ్లడాన్ని ఎన్సీబీ అధికారులు గమనించినట్లు సమాచారం. అయితే అనన్యా ఇంట్లో తనిఖీలు చేసిన అధికారులకు ఏం లభ్యమైందనే విషయం ఇంకా బయటకు రాలేదు. 22 ఏళ్ల అనన్య.. 2019లో స్టూడెంట్ ఆఫ్ ది ఇయర్ 2 మూవీతో హిందీ చిత్ర పరిశ్రమలో అరంగేట్రం చేసింది. ప్రస్తుతం ఆమె చేతిలో ఖో గయే హమ్తోపాటు టాలీవుడ్ హ్యాండ్సమ్ హంక్ విజయ్ దేవరకొండ సరసన నటిస్తున్న లైగర్ సినిమా కూడా ఉంది. లైగర్‌తో తెలుగు సినీ అభిమానులను అలరించడానికి ఆమె సిద్ధమవుతోంది.