TheIndiaMedia website is for sale. Those who are interested to purchase can reach out to us at theindiamedia2020@gmail.com
Home » News » కుటుంబ కలహాలు… మరదలు ఆత్మహత్యాయత్నం… బావ మృతి!..

కుటుంబ కలహాలు… మరదలు ఆత్మహత్యాయత్నం… బావ మృతి!..

by Murthy

భార్యతో గొడవలు.. ప్రియురాలిని వదిలి ఉండలేక ఒక వ్యక్తి ఆత్మహత్యకు పాల్పడిన ఘటన తిరుపతిలో వెలుగుచూసింది. హైదరాబాద్, చందా నగర్ కి చెందిన సాయి నవీన్ ని నాలుగేళ్ళ క్రితం కూకట్ పల్లి కి చెందిన యువతితో వివాహమైంది. వీరికి ఒక కుమారుడు. ప్రస్తుతం అతని భార్య గర్భవతిగా ఉంది. ఇక ఆర్థిక ఇబ్బందుల కారణంగా కొద్దీ రోజుల నుంచి భార్యాభర్తల మధ్య గొడవలు జరుగుతున్నాయి. ఈ నేపథ్యంలోనే అక్కకు తోడుగా ఉండడానికి వచ్చిన చెల్లెలు, బావ సాయి నవీన్ తో చనువుగా మాట్లాడడం మొదలుపెట్టింది. ఆ చనువు కాస్తా వారిద్దరి మధ్య వివాహేతర సంబంధానికి దారి తీసింది. 

మరదలికి మాయమాటలు చెప్పి మూడురోజుల క్రితం తిరుపతికి తీసుకెళ్లాడు. ఒక లాడ్జిలో గది అద్దెకు తీసుకొని పెళ్లి చేసుకుందామని మరదలిని అడగగా.. ఆమె అక్కకు అన్యాయం చేయాలేనన్ని తెలిపి నిద్రమాత్రలు మింగి అపస్మారక స్థితిలోకి వెళ్ళిపోయింది. ఇక మరదలు లేని బతుకు నాకు వద్దనుకుని సాయి నవీన్ అదే గదిలో ఫ్యాన్ కి ఉరేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. ఉదయం గది తలుపులు తెరిచిన హోటల్ సిబ్బందికి సాయి నవీన్ ఫ్యాన్ కి వేలాడుతూ కనిపించగా.. కొన ఊపిరితో కొట్టుకుంటూ మరదలు కనిపించింది.

Related Articles

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More