TheIndiaMedia website is for sale. Those who are interested to purchase can reach out to us at theindiamedia2020@gmail.com
Home » News » కూతురు చనిపోయినా బాత్ రూంలో దాచిపెట్టిన తల్లి. కొడుకు ఫిర్యాదు

కూతురు చనిపోయినా బాత్ రూంలో దాచిపెట్టిన తల్లి. కొడుకు ఫిర్యాదు

by Murthy
2016లో మరణించిన తన చెల్లెలి మృతదేహాన్ని సాల్మియా ప్రాంతంలోని వారి కుటుంబ గృహంలో బాత్రూమ్ లోపల ఉంచినట్లు అంతర్గత మంత్రిత్వ శాఖకు నివేదించాడు ఓ యువకుడు.  వెంటనే భద్రతా సిబ్బంది ప్రదేశానికి చేరుకున్నారు   మూసివేసిన బాత్‌రూమ్‌లో ఇరవై సంవత్సరాల వయస్సు గల స్త్రీ అస్థిపంజరం కనిపించింది. ఓ వృద్ధురాలు ఐదేళ్ల క్రితం చనిపోయిన తన కూతురి మృతదేహాన్ని బాత్‌రూంలో దాచిపెట్టింది. చివరకు ఆమె కుమారుడి ఫిర్యాదుతో ఈ విషయం బయటకు వచ్చింది. మృతిచెంది ఐదేళ్లు కావొస్తుండడంతో కేవలం ఎముకలు మాత్రమే దొరికాయి. వాటిని స్వాధీనం చేసుకున్న అధికారులు ఫోరెన్సిక్‌కు పంపించారు. అసలు ఆ యువతి మరణానికి కారణం ఏంటనేది ఫోరెన్సిక్ నివేదిక వస్తేగానీ తెలియదని అధికారులు తెలిపారు. మరోవైపు పోలీసులు వృద్ధురాలితో పాటు ఆమె కుమారుడిని అదుపులోకి తీసుకుని విచారించారు. 

కూతురు తన మాట వినకపోవడంతో బాత్‌రూంలో పెట్టి కొన్ని రోజులు అందులోనే ఉంచానని వృద్ధురాలు తెలియజేసింది. ఆమెను బయటకు తీయకుండా అందులోనే ఆహారం, నీరు అందించినట్లు తెలిపింది. ఈ క్రమంలో ఒకరోజు తన కూతురు చనిపోయిందని, ఈ విషయం బయటకు తెలిస్తే ప్రమాదమని భావించి అదే బాత్‌రూంలో ఉంచేసినట్లు చెప్పుకొచ్చింది. అలా ఐదేళ్లు గడిచి పోయాయి. అయితే, ఈ విషయం ఎప్పటికైనా బయటపడితే తనకు కూడా ప్రమాదమని భావించిన ముసలావిడా కుమారుడు తాజాగా అంతర్గత మంత్రిత్వశాఖ అధికారులకు ఈ ఫిర్యాదు చేశాడు. దాంతో ఈ షాకింగ్ ఘటన వెలుగులోకి వచ్చింది

Related Articles

Leave a Comment

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More