Home » Life Style » హైదరాబాద్ సమీపంలో ఉన్న టాప్ 5 అందమైన జలపాతాలు

హైదరాబాద్ సమీపంలో ఉన్న టాప్ 5 అందమైన జలపాతాలు

by Bellamkonda

హైదరాబాద్ అంటే ప్రతిఒక్కరికి గుర్తొచ్చేది సిటీ వాతావరణం ఆ సిటీలో ఉండే టూరిస్ట్స్ ప్లేసులు, షాపింగ్ మాల్స్ మరియు హైదరాబాద్ బిర్యానీ. కానీ హైదరాబాద్ కి దగ్గర్లో ఎన్నో అందమైన జలపాతాలు కూడా ఉన్నాయి.  హైదరాబాద్ సిటీ కి అతి తక్కువ దూరంలోనే ఆహ్లాదకర వాతావరణం మధ్య జలపాతాలు ఉన్నాయి. అసలు జలపాతాలని చూడడానికి ఇష్టపడని వారు ఎవ్వరూ ఉండరు, జలపాతాలను చూడగానే ప్రతోక్కరిలో కొత్త ఉత్సాహం పుడ్తుంది. 

1) ఎత్తిపోతల  జలపాతం

 చంద్ర వంక నదిపై హైదరాబాద్ కి 200 కిలోమీటర్ల దూరంలో ఉన్న అత్యంత అద్భుతమైన జలపాతాలలో ఎత్తిపోతల జలపాతం ఒకటి. ఈ జలపాతం అన్ని వైపులా పచ్చదనం ఎటు చూసిన చుట్టూ అందమైన ప్రదేశంలో ఉంటుంది దీన్ని చూసిన వారికి  ఎంతో మాసిక ప్రశాంతతను అందిస్తుంది. ఈ జలపాతానికి మనం చాలా దగ్గర వరకు వెళ్లే అవకాశం ఉంది.  

హైదరాబాద్ నుంచి  దూరం: ఈ జలపాతం గుంటూరు జిల్లా నాగార్జున సాగర్ సమీపంలో ఉంది, నాగార్జున సాగర్ నుండి కేవలం 14 కిలోమీటర్లు  మరియు హైదరాబాద్ నుండి 176 కిలోమీటర్ల  దూరంలో ఉంది.  
ఈ జలపాతం కి దగ్గరలో చూడవలసిన ప్రదేశాలు: నాగార్జున సాగర్ డ్యామ్, రంగనాథ ఆలయం, దత్తాత్రేయ ఆలయం దర్శించుకోవచ్చు. 

2) మల్లెలతీర్థం జలపాతం

మల్లెలతీర్థం జలపాతం శ్రీశైలం కి అతి సమీపంలో ఉంది. ఈ జలపాతం కృష్ణ నదిపై ఉంది.  ఈ జలపాతం చూసిన వారు తప్పకుండా  జీవితకాల జ్ఞాపకంగా దీన్ని గుర్తుంచుకుంటారు. మల్లెలతీర్థం జలపాతం నల్లమల్ల దట్టమైన అడవుల మధ్యన ఉన్నప్పటికీ మనం రోడ్ మార్గం లో తేలికగా ప్రయాణించవచ్చు, కానీ  వర్షాకాలం లో మాత్రం ఈ జలపాతానికి వెళ్లే రోడ్ సరిగ్గా ఉండదు.

హైదరాబాద్ నుంచి  దూరం: ఈ జలపాతం  దట్టమైన నల్లమల అడవిలో, శ్రీశైలం నుండి 58 కిలోమీటర్ల  దూరంలో మరియు హైదరాబాద్ నుండి 185 కిలోమీటర్ల  దూరంలో ఉంది.

ఈ జలపాతం కి దగ్గరలో చూడవలసిన ప్రదేశాలు:  మల్లిఖార్జున ఆలయం, సాక్షి గణపతి ఆలయం, పాలధర, పంచధర మరియు పాతాళగంగ ఆనకట్ట.

3) కుంటాల జలపాతం

తెలంగాణ లో అతి ఎత్తైన జలపాతం కుంటాల, ఇది కడెం నదిపై కుంటాల గ్రామం వద్ద ఉంది. ఈ జలపాతం  ఆదిలాబాద్ జిల్లాలో ని సహ్యాద్రి పర్వతశ్రేణుల్లో ప్రవహిస్తుంది. ప్రక్రుతి ఒడిలో ఎంతో కనువిందు చేస్తూ నేలమీదకు దూకే ఈ జలపాతాన్ని చూస్తే ఎవ్వరైనా ముగ్దులు అవ్వాల్సిందే.

హైదరాబాద్ నుంచి  దూరం:  ఈ జలపాతంహైదరాబాద్ నుండి  260 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది.

ఈ జలపాతం కి దగ్గరలో చూడవలసిన ప్రదేశాలు:  జలపాతం దగ్గరలో ఉన్న జంతువులూ తప్ప మనకు ఇక్కడ చూడడానికి ఏ ప్రదేశాలు ఉండవు. 

4) పొచ్చెర జలపాతం

పొచ్చెర జలపాతం ఆదిలాబాద్ జిల్లాలో ఉంది, ఇది రాతిపైనుండి ప్రవహిస్తూ చివరకు 40 అడుగుల ఎత్తు నుండి రెండు స్టెప్స్ గా కిందకు పడుతుంది. పొచ్చెర జలపాతం కుంటాల జలపాతం కి కేవలం 22 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది.

హైదరాబాద్ నుంచి  దూరం:  ఈ జలపాతంహైదరాబాద్ నుండి  257 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది.

ఈ జలపాతం కి దగ్గరలో చూడవలసిన ప్రదేశాలు:  బాసర సరస్వతి ఆలయం, కావల్ వన్యప్రాణుల అభయారణ్యం, ప్రణహిత వన్యప్రాణుల అభయారణ్యం, మరియు సువర్ణపురి.

5) గాయత్రి జలపాతం

మీరు హైదరాబాద్ నుండి ఎక్కువ జనాభా లేని ప్రశాంతమైన జలపాతంకి  వెళ్ళాలి అనుకుంటే  గాయత్రి జలపాతాన్ని సందర్శించవచ్చు. హైదరాబాద్‌కు సమీపంలో అత్యంత ఆహ్లదపూరిత ప్రదేశం లో ఈ జలపాతం ఉంది.  ఈ జలపాతం సుమారు 100 అడుగుల ఎత్తు నుండి ప్రవహిస్తుంది. 

హైదరాబాద్ నుంచి  దూరం:  ఈ జలపాతం హైదరాబాద్ నుండి  233 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది.

ఈ జలపాతం కి దగ్గరలో చూడవలసిన ప్రదేశాలు:  మంజీరా డ్యామ్, నిజాం సాగర్, యల్లంపల్లి

Also Read: Telangana Coronavirus Update September 1: 2,734 New Cases, 9 Deaths

Also Read: TOP Trending News Of The Day September 1 | Hyderabad Ganesh Immersion 2020 | CM KCR | YS Jagan | Pranab Mukherjee

Also Read: Vitamin D Deficiency Increase The Risk Of Coronavirus, Top 5 High Vitamin D Foods

Also Read: కరోనా: ఫేస్ మాస్క్ ఉపోయోగిస్తే కలిగే ఆరోగ్య సమస్యలు…! పరిష్కారాలు

Related Articles

Leave a Comment

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More

You cannot copy content of this page