TheIndiaMedia website is for sale. Those who are interested to purchase can reach out to us at theindiamedia2020@gmail.com
Home » Life Style » పునీత్ మరణంతో ఆస్పత్రుల చుట్టూ తిరుగుతోన్న జనం…ఎందుకూ

పునీత్ మరణంతో ఆస్పత్రుల చుట్టూ తిరుగుతోన్న జనం…ఎందుకూ

by Murthy

కన్నడ సూపర్ స్టార్ పునీత్ రాజ్ కుమార్ మరణం అందర్నీ కలిచివేసింది. నిన్న ఆయనకు నివాళులు అర్పించడానికి లక్షల్లో అభిమానులు వేలల్లో సెలబ్రిటీలు వచ్చారు. ఇవాళ ఉదయం 4.30 గంటలకే అంతిమ యాత్ర మొదలైంది. భౌతికకాయాన్ని స్టేడియం దగ్గర్లోనే ఉన్న కంఠీరవ స్టూడియోకి తరలించారు. పునీత్ రాజ్ కుమార్ అంత్యక్రియలు అభిమానులు, సన్నిహితులు, కుటుంబ సభ్యుల కన్నీటి మధ్య ప్రభుత్వ లాంఛనాలతో ఘనంగా జరిగాయి. సంప్రదాయ పద్దతిలో అంత్యక్రియలు పూర్తయ్యాయి. అయితే ఇదంతా వారం కిందటి పునీత్ మరణం చాల మందికి ఆరోగ్యం పట్ల శ్రద్ధవహించాలని భావించారేమో?. పునీత్ మరణం తర్వాత తీవ్ర భయాందోళనలకు గురవుతున్న ప్రజలు గుండె సంబంధిత పరీక్షలు చేయించుకోవడానికి ఆసుపత్రుల చుట్టూ తిరుగుతున్నారు.  ఈ విషయాన్ని ఆసుపత్రులు కూడా ధ్రువీకరిస్తున్నాయి.

ఫిట్‌నెస్‌పై ప్రత్యేక శ్రద్ధ చూపించే పునీత్..  జిమ్‌లో కసరత్తులు చేస్తూ కార్డియాక్ అరెస్ట్‌ కారణంగా అకస్మాత్తుగా కన్నుమూశారు. ఈ నేపథ్యంలోనే ఆయన చేసిన అనేక మంచి పనులతో పాటు వ్యాయామం చేస్తున్న కొన్ని వీడియోలు కూడా సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. కర్ణాటక ప్రజలు ఆసుపత్రులకు క్యూ కడుతున్నారు. ముఖ్యంగా బెంగళూరు ఆసుపత్రులు ప్రజలతో కిక్కిరిసిపోతున్నాయి. పునీత్ మరణం తర్వాత తీవ్ర భయాందోళనలకు గురవుతున్న ప్రజలు గుండె సంబంధిత పరీక్షలు చేయించుకోవడానికి ఆసుపత్రుల చుట్టూ తిరుగుతున్నారు.  రాష్ట అవతరణ దినోత్సవ నేపథ్యంలో నవంబర్ 1న పబ్లిక్ హాలిడే అయినప్పటికీ ఆ రోజు సుమారు 1700 మంది ప్రజలు ఆసుపత్రిని సందర్శించినట్లు పేర్కొన్నారు. మరో ప్రముఖ ఆసుపత్రిలో కూడా పరిస్థితి ఇలానే ఉందని సదరు ఆసుపత్రి ప్రతినిధులు పేర్కొన్నారు. 

Related Articles

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More