కేవలం మద్యం చరిత్రను తెలిపేందుకే ఓ ప్రదర్శనశాలను ఏర్పాటు చేశారు. ‘ఆల్ అబౌట్ ఆల్కహాల్’ పేరిట నందన్ కుడ్చద్కర్ అనే వ్యాపారవేత్త ఈ మ్యూజియాన్ని ప్రారంభించారు. ప్రపంచవ్యాప్తంగా ఉన్న పురాతన గాజుసామాను గ్రామం కాండోలిమ్‌లో 13,000 చదరపు అడుగుల విస్తీర్ణంలో ఉంది, ఇది చరిత్ర మరియు గోవా సంస్కృతిని శక్తివంతంగా అందిస్తుంది. శతాబ్దాలుగా దేశంలో మద్యం తయారీ విధానానికి వినియోగించిన వస్తువులను ప్రదర్శనకు ఉంచిన ఈ మ్యూజియాన్ని ఇటీవలే పర్యాటకులకు అందుబాటులోకి తీసుకొచ్చారు. . మ్యూజియం స్థాపన వెనుక ఉన్న ప్రధాన ఉద్దేశం గోవా మద్యపాన వారసత్వాన్ని ప్రోత్సహించడ మేనన్న నందన్.. మద్యం వినియోగాన్ని పెంచడానికి మాత్రం కాదని స్పష్టం చేశారు. ప్రపంచ చరిత్రలోనే మద్యం కాచే విధానానికి అంకితమిచ్చిన మొట్టమొదటి ప్రదర్శనశాల ఇది అని ఆయన పేర్కొన్నారు. గోవాలో జీడిపప్పుతో మద్యం తయారుచేసే కళను ప్రోత్సహించే లక్ష్యంతోనే మ్యూజియంలో పలు వస్తువులను ప్రదర్శించారు.
1950 కాలంనాటి పులియపెట్టిన జీడిపప్పు, కొబ్బరి నీళ్ల నుంచి తయారు చేసిన ‘ఫెనీ’ (గోవాలో ప్రాచుర్యం పొందిన మద్యం) సహా.. ఫెనీ డ్రింక్ సర్వింగ్ గ్లాసులు, పాత చెక్క డిస్పెన్సర్లు, మద్యం కొలిచే పరికరాలు మ్యూజియంలో ఉన్నాయి.ఈ ఆల్కహాల్ మ్యూజియం లోపలఉన్న నాలుగు గదుల్లో పలు పాత మట్టి కుండలు, 16వ శతాబ్దానికి చెందికి చెందిన ఫెనీ సర్వింగ్ పరికరాలు, ఫెనీ గాఢతను కొలిచేందుకు ఉపయోగించే స్కేల్‌తోపాటు రష్యా నుంచి సేకరించిన క్రిస్టల్ ఆస్ట్రేలియన్ బీర్ గ్లాస్ ప్రదర్శనకు ఉంచారు. ప్రపంచవ్యాప్తంగా సేకరించిన గ్లాస్‌వేర్, ఛాలిస్, స్నిఫ్టర్స్, వంపు తిరిగిన వైన్ గ్లాసులతోపాటు ప్రపంచంలోనే ఎత్తైన పోలాండ్ షాట్ గ్లాస్, ఇతర వస్తువులు కూడా ఇందులో ఉన్నాయి. ఫెనీ మద్యం తయారీకి గతంలో ఉపయోగించిన పురాతన వస్తువులు కూడా ప్రదర్శనకు ఉంచారు,
ఆల్ అబౌట్ ఆల్మహాల్ను సందర్శిస్తున్న పర్యాటకులు, మద్యం ప్రియులు ఆ వస్తువులను చూసి సంభ్రమాశ్చర్యాలకు గురవుతున్నారు. ఇక్కడ ఎంతో విలువైన సమాచారం లభిస్తోందని ఆనందం వ్యక్తం చేస్తున్నారు.