హ్యాండ్ శానిటైజర్ ఈ పేరు వినని వాళ్ళు ఎవ్వరూ ఉండరు, మార్చ్ ముందు వరకు ఈ ప్రొడక్ట్ అంటే చాల తక్కువ మందికి తెలుసు అందులో ఇంకా తక్కువ మంది మాత్రమే దీన్ని ఉపయోగించేవారు. కానీ ఇప్పుడు కొరోనా వైరస్ ఇండియా లో విజృంభించాక ప్రతి ఒక్కరి ఇంట్లో ఇదొక నిత్యావసర వస్తువుల లిస్ట్ లో చెరోపోయింది.
మరి అలాంటి హ్యాండ్ శానిటైజర్ అంటే ఏంటి? దాన్ని వాడడం వల్ల కరోనా వైరస్ నిజంగానే చనిపోతుందా? అసలు మనం దాన్ని కరెక్ట్ గా ఉపయోగిస్తున్నామా ? శానిటైజర్ ని చేతులకి మాత్రమే ఎందుకు వాడాలి? ముక్కు, నోటి చుట్టూ రాసుకోవచ్చా? ఇలా చాల మందిలో అనేక డౌట్స్ ఉన్నాయి.
అసలు శానిటైజర్ ముక్కు, నోటి చుట్టూ రాసుకుంటే ఏమవుతుంది అని డౌట్ వచ్చిన ఒక వ్యక్తి ఏకంగా ప్రపంచ ఆరోగ్య సంస్థ (WHO) ప్రశ్నను పంపాడు. దీనికి మొదట్లో షాక్ అయినా, తర్వాత WHO సమాధానం ఇచ్చింది అదేంటంటే శానిటైజర్ క్లోరిన్ మరియు ఆల్కహాల్ వంటి రసాయనాలతో తయారు చేస్తారు, అలంటి శానిటైజర్ ని ముక్కు, నోటి చుట్టూ లేదా బట్టల పై రాసుకుంటే అత్యంత ప్రమాదకరం అని తేల్చి చెప్పింది.
ఇదే విషయం పై మరింత క్లారిటీ ఇస్తూ WHO శానిటైజర్ కెవాలం కెమిస్ట్ ల గైడెన్స్ తో మాత్రమే వదలానికి సూచించింది. అంతే తప్ప ముక్కు, నోటి చుట్టూ రాసుకుంటే వైరస్ నుండి బయటపడ్డాం పక్కనబెట్టి ప్రాణాలకే ప్రమాదం అని తేల్చి చెప్పింది. కాబట్టి శానిటైజర్ వాడడంలో ప్రయోగాలు చేయకపోవడమే మన ఆరోగ్యానికి మంచిది. రీసెంట్ గా శానిటైజర్ ఎలా వాడాలో తెలియక దాంట్లో ఆల్కహాల్ ఉందని దాన్ని మద్యానికి బదులు తాగొచ్చు అని భావించి, ఆంధ్రప్రదేశ్ లో శానిటైజర్ తాగిన 11 మంది చనిపోయారు. కాబట్టి శానిటైజర్ కేవలం చేతులకే రాసుకోవాలి అంతే కానీ మన్మథుడు సినిమాలో నాగార్జున లిప్ స్టిక్ తో ప్రయోగం చేసినట్టు మనం శానిటైజర్ తో చేస్తే అది మన ప్రాణాలకే ప్రమాదం.