లొక్డౌన్ కారణంగా సినిమా థియేటర్ లు అసలు ఎప్పుడు తెరుస్తారో తెలియక నాని “వీ” సినిమా ఓవర్ ద టాప్ ఫ్లాట్‌ఫామ్ (OTT) పై విడుదల చేయడాన్ని స్ఫూర్తిగా తీసుకొని మరిన్ని టాప్ టాలీవుడ్ సినిమాలు OTT ద్వారా విడుదలకు సిద్ధం అయ్యాయి.
కరోనా వల్ల సినిమా థియేటర్ లు మార్చ్ నుండి మూతపడగా ఇక తప్పనిసరి పరిస్థితుల్లో ఈ నిర్ణయానికి వచిన్నట్టు ఇండస్ట్రీ టాక్. అయితే ‘వీ’తో పాటు OTT ప్లాటుఫార్మ్స్ లో విడుదలకు సిద్ధంగా ఉన్న పెద్ద సినిమాలు.
- నాని వీ మూవీ:

నాని, సుధీర్‌బాబు హీరోలుగా నటించిన ‘వీ’ సినిమా సెప్టెంబర్ 5 న అమెజాన్ ప్రైమ్‌లో విడుదల అవుతుంది. ఈ సినిమాకు భారీ ఆఫర్ ఇచ్చి అమెజాన్ ప్రైమ్ కొనుక్కుంది. అమెజాన్ వీ సినిమా ట్రైలర్ ను కుడా విడుదల చేసింది. అలాగే ఆగష్టు 28 న “వస్తున్నా వచ్చేస్తున్నా” వీడియో సాంగ్ ని కూడా విడుదల చేసి సినిమా పై ప్రేక్షకుల్లో మరింత ఆసక్తి పెంచింది. ఈ సినిమాని దిల్ రాజు నిర్మించారు.
2) అనుష్క నిశ్శబ్దం మూవీ :

అనుష్క లేడీ ఓరియెంటెడ్ హీరోయిన్ పాత్రలో నటిస్తున్న చిత్రం నిశ్శబ్దం, అయితే ఈ సినిమా OTT ప్లాటుఫార్మ్ అయిన నెట్ఫ్లిక్ ( Netflix) లో విడుదల అవుతుంది అని సోషల్ మీడియా లో వార్తలు హల్చల్ చేస్తున్నాయి. ఈ సినిమా నిర్మిస్తున్న టీజీ విశ్వప్రసాద్, కోనవెంకట్ ఇప్పటికే నిశ్శబ్దం సినిమాని Netflix లో విడుదల చేసేందుకు ఒప్పందం కుదుర్చుకున్నారంటూ టాలీవుడ్ టాక్. నిశ్శబ్దం సినిమా OTT లో సెప్టెంబర్ లో విడుదల అవుతుందని సమాచారం.
3) సూర్య ఆకాశం నీ హద్దు రా

తమిళ మరియు తెలుగు ఫిలిం ఇండస్ట్రీలో స్టార్ హీరో అయిన సూర్య “సూరరై పొట్రు” అక్టోబర్ 30 న అమెజాన్ ప్రైమ్ (Amazon Prime Video)లో విడుదల కానుంది, ఈ చిత్రాన్ని తెలుగు లో “ఆకాశం నీ హద్దు రా” పేరుతో విడుదల చేస్తున్నారు. ఈ సినిమాకి కోగారు దర్శకత్వం వహించారు. ఇది తమిళనాడులో OTT లో రిలీజ్ అవ్వబోతున్న మొట్టమొదటి పెద్ద బడ్జెట్ సినిమా కావడం విశేషం.
4) సాయి ధరమ్ తేజ్ సోలో బ్రతుకే సో బెటర్

సాయి ధరమ్ తేజ్ “సోలో బ్రతుకే సో బెటర్” సినిమా అక్టోబర్ లో OTT ప్లాట్ఫారం అయిన జీ 5 (Zee 5) లో విడుదల అవుతున్నట్టు సమాచారం. ఈ చిత్రంతో సుబ్బు అనే కొత్త డైరెక్టర్ దర్శకత్వం వహిస్తున్నారు. శ్రీ వెంకటేశ్వర సినీచిత్ర పతాకంపై బీవీఎస్.ఎన్ ప్రసాద్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఎస్.ఎస్. తమన్ సంగీతం అందిస్తున్నారు.
5) రామ్ రెడ్ మూవీ

హీరో రామ్ “రెడ్” సినిమా కూడా అక్టోబర్ లో డిస్నీ + హాట్‌స్టార్ (Disney+ Hotstar) లో విడుదలకు సిద్ధంగా ఉన్నట్టు సమాచారం. ఈ విషయం పై హీరో రామ్ రీసెంట్ గా ఒక ట్వీట్ కుడా చేసారు. ఈ సినిమాకి కిషోర్ తిరుమల దర్శకత్వం వహించగా, స్రవంతి రవికిషోర్ సినిమాని నిర్మించారు. మణిశర్మ సంగీతాన్ని సమకూర్చారు.