పొగాకు, పాన్ మసాలా వ్యసనం పౌరుల ఆరోగ్యాన్ని క్షీణింప చేస్తుందని వైద్య పరిశోధనల్లో తేలిందని, అందువల్ల పాన్ మసాలాలను ప్రోత్సహించే ప్రకటనల ప్రచారం నుంచి వైదొలగాలని కోరుతూ నేషనల్ యాంటీ టుబాకో ఆర్గనైజేషన్ అధ్యక్షుడు శేఖర్ సల్కర్ అమితాబ్ కు లేఖ రాశారు. ఈ నేపథ్యంలో బాలీవుడ్ సూపర్‌స్టార్ అమితాబ్ బచ్చన్ పాన్ మసాలా ప్రకటన ఉంచి తప్పుకొన్నారు. ఇందుకోసం ఇప్పటికే తీసుకున్న డబ్బును వెనక్కు ఇచ్చేసినట్టు చెప్పారు. కేన్సర్ కారకమైన పాన్ మసాలా వినియోగాన్ని ప్రోత్సహించేలా అమితాబ్ ప్రకటనల్లో కనిపిస్తుండటంపై విమర్శలు వచ్చాయి. ఆయన అభిమానుల్లోనూ అసంతృప్తి వ్యక్తమవుతోంది. ఇవన్నీ చూశాకే అమితాబ్ ఈ నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తోంది. ఇకపై అలాంటి ప్రకటనల్లో అమితాబ్ కనిపించరంటూ ఆదివారం రాత్రి ఆయన కార్యాలయం పేర్కొంది. పాన్‌మసాలా బ్రాండింగ్ అన్నది నిషేధిత ఉత్పత్తులకు చేసే ప్రచారం(సరోగేట్) కిందకు వస్తుందన్న విషయం ఆయనకు తెలియదని తెలిపింది.
అమితాబ్ హై ప్రొఫైల్ పల్స్ పోలియో ప్రచారానికి ప్రభుత్వ బ్రాండ్ అంబాసిడర్. అతను వీలైనంత త్వరగా పాన్ మసాలా ప్రకటనల నుంచి తప్పుకోవాలి. పొగాకు వ్యసనం నుంచి యువతదూరంగా ఉండడానికి ఈ చర్య సహాయపడుతుంది’’ అని శేఖర్ సల్కర్ కోరారు.సరోగేట్ ప్రకటనను వదులుకోవాలంటూ ఇటీవలే జాతీయ పొగాకు నిర్మూలన సంస్థ కూడా అమితాబ్‌కు లేఖ రాసింది. పాన్‌మసాలా ప్రకటనలో నటించడానికి ఒప్పుకోవడంతో అమితాబ్‌పై విమర్శలు వెల్లువెత్తాయి. ఈ మేరకు ఒక బ్లాగ్‌లో ఆఫీస్ ఆఫ్ అమితాబ్ బచ్చన్ పేరిట ఒక పోస్టు కనిపించింది. గతవారం బచ్చన్ ఈ ప్రకటన నుంచి తప్పుకున్నారని, ప్రచారానికి ఒప్పుకున్నప్పుడు వాస్తవాలు తెలుసుకోకపోవడం వల్ల అంగీకరించినట్లు పోస్టులో తెలిపారు.