ది ఛాలెంజ్’ పేరుతో రష్యాలో తెరకెక్కుతోన్న ఓ సినిమా కోసం చిత్ర దర్శకుడు క్లిమ్ షిపెంకో, హీరోయిన్ యులియా పెరెసిల్డ్ అక్టోబర్ తొలివారంలో అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం (ISS) కు బయలు దేరారు. రష్యా అంతరిక్ష పరిశోధనా సంస్థకు చెందిన వ్యోమనౌకలో వీరి యాత్ర కొనసాగింది. సినిమాల్లో అంతరిక్షం, వ్యోమగాములు వంటి సన్నివేశాలు అప్పుడప్పుడు చూస్తూ ఉంటాం. కానీ రష్యాకు చెందిన ఓ చిత్ర బృందం.. ఈ సన్నివేశాలను ఏకంగా అంతరిక్షంలోనే చిత్రీకరించాలని నిర్ణయించింది. అంతేకాదు.. షూటింగ్ కోసం ఆ సినిమా డైరెక్టర్, హీరోయిన్ ప్రత్యేక వ్యోమనౌకలో అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రానికి పంపింది. అంతరిక్ష కేంద్రంలో ప్రాణాపాయ స్థితిలో ఉన్న ఓ వ్యోమగామిని కాపాడేందుకు భూమి నుంచి ఓ వైద్యుడు అక్కడికి వెళ్లే సన్నివేశం కోసం ఈ యాత్ర చేపట్టారు.
ఆరు నెలలకుపైగా (191 రోజులుగా) ఐఎస్ఎస్లోనే ఉన్న వ్యోమగామి అంటన్ ష్కాప్లెరోవ్తో సుమారు 40 నిమిషాలు ఉండే ఆ సన్నివేశాల్ని చిత్రీకరించారు. దాదాపు 12రోజుల పాటు అంతరిక్షంలోనే గడిపారు. చిత్రీకరణ పూర్తి చేసుకున్న తర్వాత ఆ ముగ్గురు వ్యోమగాములు షెడ్యూల్ ప్రకారం నేడు (అక్టోబర్ 17) ఉదయం భూమిని చేరుకున్నారు. ఈ పర్యటన విజయవంతమైనట్లు అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం (ఐఎస్ఎస్) వెల్లడించింది. దీంతో అంతరిక్షంలో సినిమా చిత్రీకరించిన తొలి దేశంగానూ రష్యా నిలిచింది.
గతకొన్నేళ్లుగా అంతరిక్ష యాత్రల్లో ప్రపంచ దేశాలు దూసుకువెళ్తున్న విషయం తెలిసిందే. ప్రైవేటులోనూ అంతరిక్ష పర్యాటకం వేగంగా అభివృద్ధి చెందుతోంది. ఈ నేపథ్యంలో కేవలం యాత్రలే కాదు తాజాగా అక్కడ సినిమా షూటింగ్లు కూడా మొదల య్యాయి. ఇందులో భాగంగా రష్యాకు చెందిన చిత్ర బృందం ఏకంగా 12రోజుల పాటు అంతరిక్షంలో షూటింగ్ నిర్వహించారు. . వీరితో పాటు ఆరు నెలలుగా ఐఎస్ఎస్లోనే ఉన్న మరో వ్యోమగామితో కలిసి ఆదివారం ఉదయం భూమిని చేరుకున్నారు. ప్రస్తుతం వారి ఆరోగ్య పరిస్థితి నిలకడగానే ఉందని రష్యా స్పేస్ ఏజెన్సీ ప్రకటించింది.
‘