హైదరాబాద్ : అనసూయ రష్మీ తమ యాంకరింగ్ , గ్లామర్ టచ్ , స్పాంటేనిటీ తో జబర్దస్త్, ఎక్స్ట్రా జబర్దస్త్ ఒకదానిమీద ఒకటి పోటీ పడి TRP లు సంపాదించేలా చేసారు. వీరి ఇద్దరి మధ్యలో అంత బాగున్నటే బయటకు కనిపించిన ఎప్పుడు గట్టి పోటీ ఉంటుంది. ఒకప్పుడు అనసూయ భారీగా రెమ్యూనరేషన్ అడగడం తో మల్లెమాల ప్రొడ్యూసర్స్ అనుసయా షాక్ ఇచ్చి రష్మీ ని జబర్దస్త్ మరియు ఎక్స్ట్రా జబర్దస్త్ కి యాంకర్ గా పరిచయం చేశారు అనే వార్తలు సోషల్ మీడియా లో వైరల్ అయ్యాయి.

ఆ తర్వాత మళ్లీ ఏమైందో తెలీదు కానీ కొన్ని రోజులకే అనసూయ తిరిగి రావడం తో జబర్దస్త్ కి యాంకర్ గా అనసూయని ఎక్స్ట్రా జబర్దస్త్ కి యాంకర్ గా రష్మీ పెట్టి మల్లెమాల ప్రొడ్యూసర్స్ షో లను నడిపిస్తున్నారు. కానీ తాజాగా మీడియా సమాచారం ప్రకారం, రష్మీ తో పోలిస్తే అనసూయ రెమ్యూనరేషన్ డబల్ అని వార్తలు వైరల్ అయ్యాయి. ఆ కథనాల ప్రకారం అనసూయ ఒక్క షో కి 2 లక్షల రూపాయలు రెమ్యూనరేషన్ గా వసూలు చేస్తుందని తెలిసింది, అలాగే రష్మీ ఒక్క షో కి 1.5 లక్షలు వసూలు చేస్తున్నారని తెలిసింది.
ఇదిలా ఉండగా లొక్డౌన్ తర్వాత యాంకర్లు రష్మీ , అనసూయ కమేడియన్ హైపర్ ఆది , సుధీర్ ఇలా అందరు రెట్టింపు ఉత్సాహం తో షౌ లను ఓ ఊపు ఊపుతున్నారు.

కాగా బుల్లితెర లో అందరికన్నా సుమ ఎక్కువ రెమ్యూనరేషన్ వసూలు చేస్తున్నారు ఆమె ఒక షో కి 2.5 లక్షలు రెమ్యూనరేషన్ వసూలు చేస్తున్నారు. ఢీ యాంకర్ ప్రదీప్ మాచిరాజు కూడా ఒక షో కి 2 లక్షలు వాసులు చేస్తున్నారు.

అలాగే యాంకర్ వర్షిణి ఒక్క షో కి 30,000 రెమ్యూనరేషన్ గా తీసుకుంటుంది.
