Home » Entertainment » రామ్ చరణ్ రెమ్యునరేషన్ – అక్షరాలా వంద కోట్లు!?. ఎంతవరకూ నిజం?!.

రామ్ చరణ్ రెమ్యునరేషన్ – అక్షరాలా వంద కోట్లు!?. ఎంతవరకూ నిజం?!.

by Murthy

ప్రభాస్.. పాన్ ఇండియా స్టార్ గా కొనసాగుతున్నారు. ఒక్కో సినిమాకి 100కోట్లు అందుకుంటున్నాడని అంటున్నారు. ఇప్పుడు ఇదే తరహాలో రామ్ చరణ్ కూడా అందుకోబోతున్నారని తెలుస్తొంది. ఇటీవలే ప్రారంభమైన శంకర్ మూవీకి రామ్ చరణ్ దాదాపు 80కోట్లు వసూలు చేస్తున్నాడని గుసగుసలు వినిపిస్తున్నాయి. ఇది చరణ్ కు 15వ సినిమా. దిల్ రాజు భారీ బడ్జెట్ తో ఈ సినిమాని నిర్మిస్తున్నారు.ఈ సినిమాకి రామ్ చరణ్ ఈ రెంజ్ రెమ్యునరేషన్ తీసుకోవడానికి కారణం లేకపోలేదు. రామ్ చరణ్ నటిస్తున్న ఆర్ ఆర్ ఆర్ సినిమాకి ఎలాంటి క్రేజ్ ఉందో అందరికి తెలిసిందే. పవన్ కల్యాణ్ – మహేష్ 50 కోట్ల రేంజు పారితోషికాలతో పాటు లాభాల్లో వాటాలు అందుకుంటున్న సంగతి తెలిసిందే. మెగాస్టార్ చిరంజీవి పెద్ద రేంజులో పారితోషికం అందుకుంటున్నారు.

రాజమౌళి దర్శకత్వంలో ఆర్ ఆర్ ఆర్ వస్తున్న సినిమా పాన్ ఇండియా మూవీగా తెరకెక్కుతుంది. ఈ సినిమా సూపర్ హిట్ అవుతుంది అని అందరికి తెలిసిందే. ఆ తర్వాత రామ్ చరణ్ క్రేజ్ మరింత పెరగడం ఖాయం. అందుకే తన తదుపరి శంకర్ సినిమాకి ఈ రెంజ్ లో రెమ్యునరేషన్ అందుకుంటున్నాడని తెలుస్తోంది. ఇక ఈ సినిమాని శంకర్ ఓ విజువల్ వండర్ గా తెరకెక్కించేందుకు ప్లాన్ చేస్తున్నారు.

బాలీవుడ్ లో ఖాన్ ల త్రయం 100 కోట్లు పైగా పారితోషికం రూపంలో అందుకుంటున్నారు. ఆ తర్వాత 100కోట్లు పైబడిన పారితోషికం అందుకునే గ్రేట్ హీరోగా కిలాడీ అక్షయ్ కుమార్ పేరు మార్మోగుతోంది. ఇక ఖాన్ లనే వెనక్కి నెట్టి ఇటీవల వార్షికాదాయంలో సక్సెస్ రేటులో దూసుకొచ్చిన అక్షయ్ అంతకంతకు పారితోషికం పెంచేస్తూ 135 కోట్ల రేంజుకు చేరాడు.

Related Articles

Leave a Comment

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More