TheIndiaMedia website is for sale. Those who are interested to purchase can reach out to us at theindiamedia2020@gmail.com
Home » Entertainment » ‘మా’ లో హీట్ పెంచిన ఆర్జీవీ ట్వీట్

‘మా’ లో హీట్ పెంచిన ఆర్జీవీ ట్వీట్

by Murthy

మా లో జరుగుతోన్న తాజా పరిణామాలపై ప్రముఖ దర్శకుడు రాంగోపాల్‌ వర్మ స్పందించారు.  మా ఎల‌క్ష‌న్స్ పై త‌న దైన శైలిలో కూచిపూడి నాట్యం కంటే కాబరేట్ డ్యాన్స్ అంటేనే చాలా ఇష్టమంటూ ‘మా’ను దారుణంగా అవమానించాడు. సిని‘మా’ జనాలు తాము నిజమైన సర్కస్ వాళ్లమని ప్రేక్షకులను నిరూపించారని మా ఎన్నికలు జరిగిన తీరుపై కౌంటర్ వేసినట్టు కనిపిస్తోంది. సాధారణ ఎన్నికలను తలపించిన సంగతి తెలిసిందే. మా ఎన్నికల్లో వారంతా కూడా బిలో ఆర్డినరీ అని నిరూపించుకున్నారు అంటూ వర్మ అందరినీ ఏకిపారేశాడు. మొత్తానికి వర్మ ఏ సైడో చెప్పలేదు. ఆ మధ్య ప్రకాష్ రాజ్ మీద వచ్చిన లోకల్ నాన్ లోకల్ ఇష్యూ మీద బాగానే స్పందించాడు. ప్రకాష్ రాజ్‌కు సపోర్ట్‌గా నిలిచిన సంగతి తెలిసిందే.

మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్  ఎన్నికలు ఏ పరిస్థితుల్లో జరిగాయి… ఎందుకు జరిగాయో అందరికీ తెలిసిందే.  లోకల్‌, నాన్‌లోకల్‌ అనే అంశం నుంచి ప్రారంభమై.. వ్యక్తిగత ఆరోపణలు, సినిమా బడ్జెట్లు, అవార్డులంటూ ఒకరిపై ఒకరు కీలక ఆరోపణలు చేసుకున్నారు. ఎన్నికలు ఈసారి సినీ ఇండస్ట్రీనే కాదు..తెలుగు రాష్ట్రాల్లోనూ చర్చకు దారి తీసింది. గతంలో ఎన్నడూ లేని విధంగా మా ఎన్నికలు తీవ్ర ఉత్కంఠను రేపాయి. ‘మేమంతా ఒకే కుటుంబం. మాది సినిమా కుటుంబం. అందరం కలిసే ఉంటాం’ అంటూనే ప్రత్యక్ష ఆరోపణలకు తెరదీశారు. ఎన్నికలు పూర్తయినా ఇంకా మాటల దాడులు మాత్రం కంటిన్యూ అవుతున్నాయి   ఫలితాలు వచ్చాక కూడా హైడ్రామానే నడిచింది.  ఇలాంటి సమయంలో ఆర్జీవీ ట్వీట్ మంట పుట్టించదూ మరి.

Related Articles

Leave a Comment

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More