ఆన్ లైన్ గేమ్స్ సోషల్ మీడియాలో సెలబ్రిటిలను గుడ్డిగా ఆరాధించడ సహా చెడు అలవాట్లకు బానిసలుగా మారిన యువతను అదుపు చేయడానికి తల్లిదండ్రుల అస్త్రాన్ని చైనా ప్రయోగించింది. cసంచలనాత్మక నిర్ణయాలు యావత్ ప్రపంచాన్ని నివ్వెరపోయేలా చేస్తున్నాయి. మొన్నీమధ్య తల్లిదండ్రులపై వన్ చైల్డ్ పాలసీ తీసుకొచ్చిన ఆ దేశం.. ఇప్పుడు మరో చట్టాన్ని పరిశీలిస్తోంది. ఇటీవల మైనర్ లకు ఆన్ లైన్ గేమింగ్ విషయంలో చైనా విద్యా శాఖ ఆంక్షలు విధించింది. వారంలో శుక్రవారం శనివారం ఆదివారం మాత్రమే రోజుకు ఒక గంట పాటు మాత్రమే ఆన్లైన్ గేమ్స్ ఆడటానికి అవకాశం కల్పించింది. అలాగే హోంవర్క్ ను కూడా తగ్గించింది. వారాంతం సెలవు దినాలలో ప్రధాన సబ్జెక్టు లకు తరగతులు తర్వాత ట్యూటరింగ్‌ను నిషేధించింది. కఠినమైన చట్టాలతో నియంతృత్వ ధోరణి అవలంభిస్తోన్న డ్రాగన్.. తాజాగా మరో సంచలన చట్టానికి రూపకల్పన చేసింది. పిల్లలు చెడుగా ప్రవర్తించడం లేదా నేరాలకు పాల్పడితే తల్లిదండ్రులను శిక్షించే చట్టాన్ని చైనా పార్లమెంట్ పరిశీలిస్తోంది.
ఈ మేరకు ‘ఫ్యామిలీ ఎడ్యుకేషన్ ప్రమోషన్ లా’ పేరుతో ముసాయిదాను రూపొందించింది. తల్లిదండ్రులు, సంరక్షకులు తమ సంరక్షణలో ఉన్న పిల్లల చెడు, నేరపూరిత ప్రవర్తన ఒకవేళ నిర్దారణ అయితే ఈ చట్టం ప్రకారం ముందుకెళ్లి చర్యలు తీసుకోవాలని ఆదేశాలు జారీచేయవచ్చు. శుక్రవారం, శనివారం, ఆదివారం మాత్రమే రోజుకు ఒక గంట పాటు మాత్రమే ఆన్లైన్ గేమ్స్ ఆడటానికి అవకాశం కల్పించింది. అలాగే, హోంవర్క్‌ను కూడా తగ్గించింది. వారాంతం, సెలవు దినాలలో ప్రధాన సబ్జెక్టులకు తరగతులు తర్వాత ట్యూటరింగ్‌ను నిషేధించింది.
ఒక జంట ఎంతమంది పిల్లలను కనాలో కూడా చైనా ప్రభుత్వమే నిర్ణయిస్తుంది. 1979 నుంచి 2016 వరకు వన్ చైల్డ్ పాలసీ అమలులో ఉంది. తరువాత ఇద్దరు పిల్లలకు అనుమతిచ్చారు. అయినా జననాల రేటు బాగా తగ్గిపోయింది. దీంతో కలవరపడిన చైనా పాలకులు ముగ్గురు పిల్లల వరకు కనొచ్చని ఈ సంవత్సరమే అనుమతించిన విషయం తెలిసిందే.